ప్రాచీన విజ్ఞానం.. ప్రపంచానికి చెబుదాం

22 Sep, 2015 01:33 IST|Sakshi
ప్రాచీన విజ్ఞానం.. ప్రపంచానికి చెబుదాం

కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా
 
 సాక్షి, సిటీబ్యూరో : ప్రాచీన పరిశోధన పుస్తకాల్లో నిక్షిప్తమైన అరుదైన శాస్త్ర విజ్ఞానాన్ని ఆధునిక ప్రపంచానికి అందించాల్సిన అవసరముందని  కేంద్ర మంత్రి నజ్మాహెప్తుల్లా అన్నారు.  సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని ప్రాచీన దాయిరతుల్ మారిఫ్ పుస్తక భాండాగారాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాచీన పుస్తకాల్లో అనేక సంస్కృతుల చరిత్ర నిక్షిప్తమై ఉందన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి భారత దేశానికి వచ్చిన వారు వివిధ సంస్కృతిలను వదిలి వెళ్ళారన్నారు. ప్రాచీన పుస్తకాలను కంప్యూటరీకరించి ఆంగ్లంలో అనువదించి ప్రపంచానికి తెలియచేయాలన్నారు. 

ఫైసల్ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదిరితే మన ప్రాచీన పుస్తకాల ఆధునీకరణకు దోహదపడుతుందన్నారు.  కేంద్ర మైనార్టీ వ్యవహారాల  శాఖ కార్యదర్శి ఆరవింద్  మాయరామ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల ప్రాజెక్టు కింద ప్రాచీన పుస్తకాల ఆధునీకరణకు నిధులు కేటాయించిద్నారు. దాయిరతుల్ మారిఫ్ డెరైక్టర్ ఫ్రొఫెసర్ ముస్తాక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.

 న్యాక్‌ను సందర్శించిన నజ్మాహెప్తుల్లా
 మాదాపూర్ : మైనార్టీ శాఖమంత్రి నజ్మా హెప్తుల్లా  మాదాపూర్‌లోని న్యాక్‌ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాక్‌లో మైనార్టీలకు ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేయాలని కోరారు. న్యాక్‌లో వివిధ విభాగాలను పరిశీలించి సిబ్బంది సేవలను కొనియాడారు.

మరిన్ని వార్తలు