‘విశ్వ’మంత ఆశ

12 Dec, 2014 00:21 IST|Sakshi
‘విశ్వ’మంత ఆశ

సీఎం కలల సాకారానికి కసరత్తు
బహుళ అంతస్తుల బాధ్యత ఆర్కిటెక్ట్ హఫీజ్‌కు అప్పగింత
ప్రణాళికలు రూపొందించాలని ఆదేశం

 
హుస్సేన్‌సాగర్ చుట్టూ అందమైన బహుళ అంతస్తుల భవనాలు.. మూసీ చుట్టూ కొత్త అందాలు.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబంగా తెలంగాణ కళాభారతి .. ఇలా ప్రపంచంలోనే ప్రత్యేకంగా... ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన నగరంగా గ్రేటర్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆ దిశగా తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే పనిని ప్రారంభించారు. దీని కోసం  ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ సేవ లను వినియోగించుకోనున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై గురువారం జరిగిన సమావేశానికి హఫీజ్‌ను ఆహ్వానించారు. ఈ బహుళ అంతస్తుల భవ నాల నిర్మాణానికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని... అందుకు తగిన ప్రణాళికలు రూపొందించాల్సిందిగా హఫీజ్ బృందాన్ని కోరారు. అంతేకాదు.. నగరంలోని ఏ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు వస్తే బాగుంటుందో పరిశీలించి ప్రణాళిక రూపొందిం చాలన్నారు.

హైదరాబాద్ నగరంప్రపంచంలోనే ప్రత్యేకంగా ఉండాలన్నారు. ఇదీ హఫీజ్ విశిష్టత.. ముంబై యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్‌లో డిప్లొమా, కొలంబియా యూనివర్సిటీలో డిగ్రీ, ఎంఎస్ పూర్తి చేసిన హఫీజ్ ఇంపీరియల్ 1, 2 భవనాలతో పాటు దేశంలోనే అత్యంత ఎత్తయిన భవనాల వాస్తుశిల్పిగా ప్రసిద్ధికెక్కారు. కొత్త పద్ధతులతో... అందరినీ ఆకట్టుకునేలా భవనాలను తీర్చిదిద్దడంలో పేరుపొందారు. హఫీజ్ ప్రాజెక్టుల్లో నోయిడా మహాగున్ మెడోస్, నవీ ముంబైలో డీవై పాటిల్ స్టేడియం, సీవుడ్స్ ఎస్టేట్ (ఎన్‌ఆర్‌ఐ కాంప్లెక్స్), గుర్గావ్‌లో డీఎల్‌ఎఫ్ అరాలియాస్, హీరానందర్ గార్డెన్స్ వంటివి ఉన్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఎన్నో నిర్మాణాలతో పాటు ఓఎన్‌జీసీ గ్రీన్‌బిల్డింగ్స్‌కు రూపకల్పన చేశారు. ప్రముఖ నగరాల్లో ఇన్ఫోసిస్ బిల్డింగ్‌లు, ఏవీ బిర్లా ట్రైనింగ్ సెంటర్ నిర్మాణంలో ఆయన నైపుణ్యం కనిపిస్తుంది. నగరంలోని మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను గతంలో హఫీజ్ సిద్ధం చేశారు. ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా బహుళ అంతస్తులతో పాటు మూసీ సుందరీకరణకు హఫీజ్ బృందం డిజైన్ చేయనుంది.  

చేపట్టనున్న పనులు
 
మూసీ నది చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త కట్టడాలు (పార్కులతో సహా) ఇందిరా పార్కు ఖాళీ స్థలంలో తెలంగాణ కళాభారతి  (నాలుగు ఆడిటోరియంలతో సహా)  రవీంద్ర భారతి ప్రదేశంలో హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలు చాటేలా నిర్మాణం     మొజాంజాహి, చార్మినార్, హుస్సేన్‌సాగర్, సాలార్జంగ్ మ్యూజియంల వద్ద కొత్త ఆకర్షణలు  టవర్లు, బహుళ అంతస్తుల భవనాలు చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక లక్షణాలు ప్రతిబింబించడంతో పాటు ఆర్థికప్రగతికి దోహదపడేలా నిర్మాణం.
 
 

>
మరిన్ని వార్తలు