తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ధర్నా

26 Jan, 2016 16:08 IST|Sakshi
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ధర్నా

హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ) జేఏసీ విద్యార్థులు మంగళవారం ధర్నా నిర్వహించారు. వేముల రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు సచివాలయం ముందు బైఠాయించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రోహిత్ ఆత్మహత్య చేసుకుని పది రోజులు కావొస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడాన్ని ఖండిస్తున్నామని తెలంగాణ విద్యార్థి జేఏసీ నేత భాస్కర్ అన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, వీసీ అప్పారావులపై కేసు నమోదైనా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు.

మరిన్ని వార్తలు