జీవించే హక్కు లేకుండా పోతోంది

30 Nov, 2015 08:37 IST|Sakshi

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశ ప్రజల భవిష్యత్ రాజ్యాంగ చట్టాలపై ఆధారపడి ఉందని,  చట్టాలను అమలు చేసే వారు సక్రమంగా అమలు చేస్తే అందరికీ సముచిత న్యాయం లభిస్తుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంధు సొసైటీ, సంత్ రవిదాస్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యంగ దినోత్సవం,  మహాత్మజ్యోతిరావు  పూలే వర్ధంతి  సభ సందర్భంగా పూలే, అంబేద్కర్‌ల భావ జాలం - రాజ్యాంగం - సామాజిక న్యాయం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. పాలనలో ఉన్నవారు చేసిన దుర్మార్గాల వల్ల జీవించే హక్కు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ వై.బి.సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగంలో సవరణలు చేయవచ్చు కానీ ఎలాంటి మార్పులు లేకుండా చూడాలని ఆయన కోరారు. ప్రభంజన్‌యాదవ్, బంధు సొసైటీ అధ్యక్షులు పి. వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు