'సిట్టింగ్ జడ్జీల కొరత.. అందుకే ఐఏఎస్ తో విచారణ'

2 Aug, 2015 12:48 IST|Sakshi
'సిట్టింగ్ జడ్జీల కొరత.. అందుకే ఐఏఎస్ తో విచారణ'

హైదరాబాద్ : రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై పూర్తిస్థాయి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గంటాతో విద్యార్థిని రిషితేశ్వరి కేసు విచారణ కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ఆదివారం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. రిషితేశ్వరి ఘటనపై వారు చర్చించారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఉదంతంపై ప్రాథమిక నివేదికను మంత్రి గంటాకు అందజేశారు.

విచారణ కమిటీకి మరో వారం రోజుల గడువు పొడిగించినట్లు గంటా తెలిపారు. యూనివర్సిటీకి సెలవులు ఉండటంతో విచారణ కోసం కమిటీ మరో వారం రోజులు గడువు అడిగినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన విచారణ గురించి కమిటీ సభ్యులు వివరించినట్లు చెప్పారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జీల కొరత ఉందని, ఐఏఎస్ అధికారితో విచారణ చేపట్టినట్లు మంత్రి వివరించారు.  సీనియర్ల వేధింపులు, ర్యాగింగ్ భరించలేక నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు