సాక్షి టుడే హెడ్ లైన్స్...

30 May, 2016 18:40 IST|Sakshi

బాబు అనైతిక రాజకీయాలను మోదీ ఆమోదిస్తారా?
రాజ్యసభ ఎన్నికల విషయంలో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ అనైతిక చర్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదిస్తారా? త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో గెలిపించుకునేంతగా ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేకపోయినప్పటికీ  నాలుగవ అభ్యర్థిని రంగంలో నిలిపి అనైతిక చర్యలకు పాల్పడటానికి రంగం సిద్ధం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలపై బీజేపీలో నేతల్లో అంతర్మథనం మొదలైంది.

టుడే హెడ్ లైన్స్...

ఆ అలవాటును గుర్తించొచ్చు
మద్యానికి బానిసయ్యే అవకాశం ఉన్న విద్యార్థులను సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది.

మెల్‌బోర్న్‌లో ఎంపీ కవితకు ఘనస్వాగతం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవితకు మెల్ బోర్న్ లో ఘన స్వాగతం లభించింది.

శ్మశానాలను వదలని తెలుగు తమ్ముళ్లు !!
తెలుగు తమ్ముళ్లు నీరు-చెట్టు పథకం పేరుతో శ్మశానాలను సైతం పూడ్చి నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు యత్నిస్తున్నారు.

మింగేసిన ఆ మహా ప్రళయానికి పదేళ్లు

ఒక సంస్కృతి, సంప్రదాయలతో పచ్చగా కళకళలాడుతున్న ఆ నివాస ప్రాంతాలను తుడిచి పెట్టేసిన బురద ప్రళయం ఇప్పుడక్కడ మిగిల్చేంది అవశేషాలు మాత్రమే.

మేమిద్దరం మరి కాసేపు ఉంటే.. రిజల్టే వేరు: కోహ్లీ
మరి కొంతసేపు తాను, డివీలియర్స్ కలిసి ఆడి ఉంటే.. ఫలితం వేరేగా ఉండేదని బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.

'విజయసాయిరెడ్డి విజయం ఖాయం'
రాజ్యసభ ఎన్నికకు టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టినా...తమ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విజయం ఖాయమని వైస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఆ వీడియో ట్విటర్ లో పెట్టిన వారికోసం..
ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన బ్రెజిల్ గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

వావ్..! ప్రపంచంలో భారతీయులే టాప్
ప్రపంచంలో భారతీయులే అత్యంత ఆత్మవిశ్వాసం గలవారని ఓ సర్వే తేల్చి చెప్పింది.

2 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం: మంత్రి పోచారం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పేదలకు రెండు లక్షల రెండు పడక గదుల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు.

యూపీలో వర్షాలకు 12 మంది మృతి
ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలకు 12మంది మృతి చెందారు.

ఫ్లిప్‌కార్ట్ బాటలోనే ఎల్‌అండ్‌టీ
ఐఐఎం పట్టభద్రులకు ఆఫర్ లెటర్లు ఇచ్చినట్లే ఇచ్చి ఎంతకీ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఫ్లిప్‌కార్ట్ మీద జనం దుమ్మెత్తి పోసిన సంగతి గుర్తుంది కదూ. ఇప్పుడు అదేబాటలో ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్ కూడా పయనిస్తోంది.

సీమా పునియాకు కోపం వచ్చింది
రియో డిజనిరోలో జరిగే ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించిన కొద్ది గంటల్లోనే డిస్కస్ త్రో ప్రముఖ క్రీడాకారిణి, గత ఒలంపిక్ విజేత సీమా అంతిల్ పునియా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

విదేశీ బ్యాంక్పై భారతీయ జంట వేలకోట్ల దావా
భారతీయ దంపతులు పంకజ్ ఓస్వాల్ రాధిక ఆస్ట్రేలియన్ బ్యాంకు కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు.

ఆన్ లైన్ పెళ్లి సంబంధాలపై డేగ కన్ను!
మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో ప్రొఫైళ్ల ద్వారా వరుడు లేదా వధువులను బోల్తా కొట్టించి డబ్బు లేదా వేరే విధంగా దోచుకునే వారికి త్వరలో ముకుతాడు పడనుంది.

బిగ్ బజార్ భారీ డిస్కౌంట్ స్కీమ్
ఆన్ లైన్ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి పోటీని తట్టుకోవడానికి దేశంలోనే అతిపెద్ద సూపర్ మార్కెట్ చైన్ బిగ్ బజార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

హోటళ్లలో సరికొత్త బాదుడు
సరదాగా సెలవు రోజుల్లో దుబాయ్ వెళ్లి వద్దామనుకుంటున్నారా? అయితే జేబులు మరికాస్త ఎక్కువగా నింపుకోండి.

మహిళల టాప్ ఐదు భయాలు తెలుసా?
గ్లామర్ మీద కామెంట్ చేస్తే మహిళలు అస్సలు తట్టుకోలేరనే విషయం సాధారణంగా అందరికీ తెలిసిందే.

కష్టాల్లో కమెడియన్
'సచిన్ వర్సెస్ లత సివిల్ వార్' వ్యవహారంతో కమెడియన్ తన్మయ్ భట్ కష్టాల్లో పడ్డాడు.

బయోమెట్రిక్ హాజరు సాధ్యమేనా?
ఈ విద్యా సంవత్సరంలో యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు తప్పని సరిగా అమలు చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తుంది.

నిషేధం అమలు మరో 11 సిటీల్లో?
దేశ రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న పెద్ద డీజిల్ వాహనాల అమ్మక నిషేధం మరో 11 సిటీలపై కూడా విధించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్ జీటీ) నేడు నిర్ణయం తీసుకోనుంది.

సాఫ్ట్ బ్యాంక్ సీవోవో జీతం ఎంతో తెలుసా?
జపాన్‌కు చెందిన టెలీ కమ్యూనికేషన్స్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ అధ్యక్షుడు, సీవోవో నికేష్ అరోరా (48) ఈ ఏడాదికి గాను 5వందల కోట్ల భారీ వేతనంతో మరోసారి తన సత్తాను చాటుకున్నారు.

'చంద్రబాబు మాటల వెనుక ఏదో కుట్ర'
త్వరలో వైఎస్సార్ సీపీ ఖాళీ అవుతుందన్న ఆయన మాటల వెనుక ఏదో కుట్ర ఉందని భూమన కరుణాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

'నాది ఆకర్షించే అందం కాదంట'
పెరల్ హార్బర్ చిత్రం కోసం తనను నాజూకుగా తయారవ్వమని డైరెక్టర్ మైఖెల్ బే చెప్పినట్లు ప్రముఖ హాలీవుడ్ నటి కేట్ బెకిన్ సేల్ తెలిపింది.

లక్షా 20వేల బీఎండబ్ల్యూ కార్ల రీకాల్
ప్రముఖ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేసింది. ఎయిర్ బ్యాగ్ సాంకేతిక లోపాలకారణంగా అమెరికాలో దాదాపు లక్షా 20వేలకార్లను వెనక్కి పిలిపించనున్నట్టు తెలుస్తోంది.

భార్యకు మొండిచేయి చూపిన లాలూ
లాలూ ప్రసాద్ భార్య రబ్రీదేవిని కాదని కూతురికి రాజ్యసభ సీటు ఇచ్చారు.

వెంకయ్య, నిర్మలా సీతారామన్‌లను ఎందుకు వద్దనుకున్నారు?
కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌లకు బీజేపీ నాయకత్వం తిరిగి రాజ్యసభ టికెట్లు ఖరారు చేసినా, వారిని స్వరాష్ట్రం నుంచి కాకుండా వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎందుకు నామినేట్ చేస్తున్నట్టు?

టాప్ టెన్ కాస్ట్లీ స్మార్ట్ ఫోన్లు ఇవే...
ఇన్నిరోజులు అత్యధిక ధరలున్న స్మార్ట్ ఫోన్లు ఏవీ అంటే.. యాపిల్ ఐఫోన్ స్మార్ట్ ఫోన్లేనని చటుక్కున చెప్పేవాళ్లం.

తిడుతున్నా ట్రంప్కు చైనాలో భలే డిమాండ్
చైనా తమ దేశాన్ని రేప్ చేసిందంటూ.. తమ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్కు చైనాలో మాత్రం మంచి డిమాండ్ పెరుగుతోంది.

ఓలా, ఊబర్ లకు షాక్
తక్షణమే లైసెన్స్ తీసుకోవాలన్న ప్రభుత్వ నిబంధలను బేఖాతరు చేసిన ట్యాక్సీల సేవలను తక్షణమే నిలిపివేయనున్నట్టు కర్ణాటక ప్రకటించింది.

గేల్ ను అవుట్ చేయడానికి వార్నర్ ఏం చెప్పాడు?
క్రిస్ గేల్ ను అవుట్ చేయడానికి వైడ్, స్లో బంతులు వేయాలని తమ బౌలర్లకు చెప్పినట్టు వార్నర్ వెల్లడించాడు.

వ్యభిచారం చేయమని తల్లి, భర్త ఒత్తిడి, సూసైడ్
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోములలో దారుణం చోటుచేసుకుంది.

ఢిల్లీలో దౌర్జన్యానికి దిగిన ఆఫ్రికన్లు!
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున ఓ క్యాబ్‌ డ్రైవర్‌పై ఆఫ్రికన్ దేశస్తులు దౌర్జన్యానికి దిగారు.

యూత్‌కి సత్య నాదెళ్ల సలహా ఇదే!
భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం న్యూఢిల్లీలో కీలకోపన్యాసం ఇచ్చారు.

ఈ ఫ్యామిలీ వెరీ స్పెషల్..!
ఫెదరర్ టెన్నిస్ తర్వాత అధిక ప్రాధాన్యం ఇచ్చేది కుటుంబానికే. విశేషం ఏంటంటే.. ఫెడెక్స్ ఆటే కాదు అతని కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది.

విరాట్ అరుదైన ఫీట్
ప్రస్తుతం క్రికెట్‌ ను శాసిస్తున్న ఆటగాళ్లలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ముందున్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

నేపాల్ సరిహద్దులో చిక్కుకున్నతెలుగువారు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన 28 మంది తీర్థయాత్రలకు వెళ్లి నేపాల్ సరిహద్దులో చిక్కుకున్నారు.

ఆ సినిమాలో బోర్ సీన్స్ తీసినందువల్ల..
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం' ఫ్యాన్స్ను నిరాశ పరిచిన విషయం తెలిసిందే.

పవిత్రమైన పాత్రలో నటించి.. బికినీ ఫొటోలా?
మీరు ప్రముఖమైన టీవీ నటులా? అయితే సోషల్ మీడియలో ఫొటోలు పెట్టే విషయంలో కాస్తా జాగ్రత్త ఉండండి!

యూపీ బీజేపీ సీఎంగా స్మృతి ఇరానీ?
వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలను ప్రభావితం చేయగల ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయాన్ని కైవసం చేసుకోవాలనే కృతనిశ్చయంతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఉంది.

అమ్మాయిలే ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారట
అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్నారట.

వార్నర్ పీఎస్ఎల్ టైటిల్ గెలిచాడట!
తమ క్రికెటర్లు పెద్దగా విద్యావంతులు కాదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)చైర్మన్ షహర్యార్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను నిజమని నిరూపించాడు ఆ దేశ క్రికెటర్ ఉమర్ అక్మల్.

ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారమిక్కడ భేటీ అయ్యారు.

'అందుకే విజయ సాయిరెడ్డిని పోటీలో నిలిపాం'
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఒక అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్య కంటే ఎక్కువ బలం తమకుందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

ఆ అసభ్య వీడియోను వెంటనే బ్లాక్ చేయండి!
సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్న కమెడియన్‌ తన్మయ్‌ భట్‌ వీడియోపై ముంబై సైబర్‌ సెల్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఆ యాడ్ తీయడం తప్పే.. క్షమించండి
చైనాలో కియోబీ అనే లాండ్రీ డిటర్జెంట్ బ్రాండ్ ప్రకటన జాతి దురహంకారానికి ప్రతీకగా ఉందంటూ సర్వత్రా విమర్శలు రావడంతో ఈ కంపెనీ వెనక్కి తగ్గింది.

కారెక్కనున్న మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి
తెలంగాణ టీడీపీకి చెందిన మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు సీహెచ్ మల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధమవుతోంది.

నెహ్రా వుయ్‌ మిస్‌ యూ! ఈ విజయం నీకే అంకితం!!
8 పరుగుల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను హైదరాబాద్ సన్‌ రైజర్స్‌ ఓడించడంతో సంబరాలు మిన్నంటాయి.

మరిన్ని వార్తలు