నిమ్స్‌లో అత్యవసర సేవలు బంద్

8 Aug, 2014 00:57 IST|Sakshi
నిమ్స్‌లో అత్యవసర సేవలు బంద్

నేటి నుంచి సెమీస్కిల్డ్ ఉద్యోగుల సమ్మె
 
హైదరాబాద్ : ‘నా భార్య ధనలక్ష్మికి డయాలసిస్ చేయించాలి. ఆ విభాగంలో ఎవ్వరూ లే రు ఒక్కసారి వచ్చి చూడండి సార్ .’ అని ఎల్బీ నగర్‌కు చెందిన నర్సింహారెడ్డి నిమ్స్ సెమీస్కిల్డ్ ఉద్యోగుల వద్ద కన్నీరుమున్నీరైన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఇలాంటి ఘట నలు గురువారం నిమ్స్‌లో ఎన్నో కనిపిం చాయి. శుక్రవారం నుంచి సెమీస్కిల్డ్ ఉద్యోగులు పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళితే ఇక రోగులకు ఇబ్బందులు తప్పవు. ఒప్పందం ప్రకారం తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ సెమీస్కిల్డ్ ఉద్యోగులు గురువారం డెరైక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశా రు. డెరైక్టర్‌తో చర్చలు విఫలం కావడంతో శుక్రవారం నుండి సమ్మె చేయాలని నిర్ణయించారు.

ఆస్పత్రిలో నిలిచిపోనున్న సేవలు.....

ప్రస్తుతం ఆసుపత్రిలోని అన్ని క్యాష్‌కౌంటర్లలో సెమీస్కిల్డ్ ఉద్యోగులే ఉన్నారు. దీంతో క్యాష్ కౌంటర్‌లు మూసేయాల్సిన పరిస్థితి. క్యాష్ కట్టనిదే ఎక్కడా వైద్యం, వైద్యపరీక్షలు జరుగవు. ఆరోగ్యశ్రీలో మొత్తం అడ్మిషన్లు ఆగిపోతాయి. డయాలసిస్, ఎక్సరే, సివిల్, ఎలక్ట్రికల్ తదితర టెక్నికల్ వర్క్స్ సెమీస్కిల్డ్ ఉద్యోగులే నిర్వహిస్తారు. ఎమర్జెన్సీ వార్డులో అడ్మిషన్లు, గ్యాస్ రూమ్‌లను ఆక్సిజన్ సరఫరా చేసేవారు సెమీస్కిల్డ్ ఉద్యోగులే కావడంతో అత్యవసర విభాగంలో వెంటిలేటర్లు, శస్త్రచికిత్సలు నిర్వహించే వారికి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడే ప్రమా దముంది.  కరెంట్ పోతే జనరేటర్లు ఆన్ చేసే వారు కూడా ఈ విభాగానికి చెందిన వారే.
 

మరిన్ని వార్తలు