నిమ్స్‌ను సందర్శించిన నిజాం మనవడు 

30 Sep, 2023 03:15 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నిజాం మనవడు నవాబ్‌ నజీఫ్‌ అలీ ఖాన్‌ శుక్రవారం నిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించారు. పిల్లల గుండె శస్త్ర చికిత్సల శిబిరాన్ని విజయవంతం చేసినందుకు నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్పను అభినందించారు. యూకే నుంచి వచ్చిన కార్డియోథెరపిక్‌ వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. పేద రోగులు, సమాజానికి ప్రయో జనం చేకూరేలా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఇంచార్జ్, ఆర్‌ఎంఓ డాక్టర్‌ సల్మాన్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు