పోలీసుల అదుపులో నయీమ్ ముఖ్య అనుచరుడు

10 Aug, 2016 08:04 IST|Sakshi

నల్గొండ: రెండు రోజుల క్రితం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగస్టర్ నయీమ్ ముఖ్య అనుచరుడు షూటర్ రియాజ్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అతడు తలదాచుకున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో అక్కడికి చేరుకుని రియాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అతడి  వద్ద నుంచి కొన్ని తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అర్థరాత్రి 12 గంటలకు రియాజ్‌ను హైదరాబాద్ నుంచి నల్గొండ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు