హీరోయిన్‌గా ఒక్క సినిమా చేసింది.. అదే ఫస్ట్‌ & లాస్ట్‌.. ఇప్పుడేం చేస్తుందంటే?

21 Dec, 2023 17:40 IST|Sakshi

సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. లేదంటే ఎంత టాలెంట్‌ ఉన్నా ఇక్కడ ఎక్కువకాలం రాణించలేం. పై ఫోటోలో ఉన్న బెంగాలీ బ్యూటీ సీరియల్‌ నటిగా తన ప్రయాణం మొదలుపెట్టింది. తన ప్రతిభతో సినిమా ఛాన్స్‌ కూడా అందుకుంది. కానీ కెరీర్‌ మొత్తంలో ఒకే ఒక్క సినిమా చేసింది. అది కూడా తెలుగులో, అందులోనూ హీరోయిన్‌గా!

ఒక్క సినిమాతో ఆగిపోయిన వెండితెర ప్రయాణం
టాలీవుడ్‌ హీరో గోపీచంద్‌ నటించిన హిట్‌ సినిమాల్లో యజ్ఙం ఒకటి. ఈ సినిమా గోపీచంద్‌కు కలిసొచ్చింది కానీ ఇందులో కథానాయికగా నటించిన సమీరా బెనర్జీకి మాత్రం ఏమాత్రం ఉపయోగపడలేదు. ఈ మూవీ తర్వాత బ్యూటీకి ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. కొంతకాలం పాటు అవకాశాల కోసం ఎదురుచూసింది. కానీ ఫలితం లేకపోయింది. ఆ తర్వాత నిర్మాత నీరజ్‌ శర్మాను పెళ్లాడింది బెనర్జీ. వీరికి సుమారు 11 ఏళ్ల బాబు ఉన్నాడు.

ఏం చేస్తుందంటే?
సమీరా బెనర్జీ అసలు పేరు మూన్‌ బెనర్జీ. ఈమెకు సినిమా ఛాన్సులు రాకపోవడంతో తిరిగి సీరియల్స్‌ వైపు వెళ్లిపోయింది. కసౌటీ జింగదీ కే, క్యోన్‌కీ సాస్‌ భీ కబీ బహూతీ, రిష్తాన్‌ కీ డర్‌, సాసురల్‌ జెండా పూల్‌, ఏక్‌ తా రాజా ఏక్‌ తా రాణీ, ముస్కురాన్‌ తదితర సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం గమ్‌ హై కిసీకే ప్యార్‌ మే, సాసురాల్‌ సిమర్‌ కా 2 ధారావాహికలతో అభిమానులను అలరిస్తోంది. అయితే 40 ఏళ్లు దాటడంతో తల్లి పాత్రలే ఎక్కువగా వస్తున్నాయంటోంది బెనర్జీ.

చదవండి: విడాకులు, బ్రేకప్‌.. ముచ్చటగా మూడోసారి లవ్‌లో పడ్డ సల్మాన్‌ సోదరుడు!

>
మరిన్ని వార్తలు