‘స్థానిక’ ఉప ఎన్నికలకు నగారా

21 Aug, 2016 02:10 IST|Sakshi
‘స్థానిక’ ఉప ఎన్నికలకు నగారా

నోటిఫికేషన్ విడుదల చేసినరాష్ట్ర ఎన్నికల సంఘం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న మండల ప్రాదేశిక నియోజకర్గాలకు, సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాల ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌తోపాటు షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఈ నెల 26న ఎన్నికల నోటీసు, ఓటర్ల జాబితాలను ప్రకటించనుంది. నామినేషన్ల స్వీక రణ గడువు 29న సాయంత్రం ఐదు గంటల వర కు ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సెప్టెంబర్ 3వ తేదీ వరకు విధించారు.

8న ఉద యం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది.  అదే రోజు మధ్యాహ్నం రెండు గం టల నుంచి సర్పంచ్, వార్డు స్థానాలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. 10 తేదీన ఉదయం 8 గంటల నుంచి  ఎంపీటీసీ స్థానాల ఓట్లను లెక్కిస్తారు. ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలకు సంబంధించి సదరు మండల ప్రజాపరిషత్ ప్రాంతం, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి సదరు పంచాయతీ ప్రాంతం వరకు ఎన్నికల నియమావళి  శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు దీనికి లోబడి పనిచేయాలని ఆదేశించింది. ఈ ఉప ఎన్నికలకు అవసరమైన సన్నాహాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రారంభించింది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు