మోదీపైనే అవినీతి మరకలు...

9 Jan, 2017 03:18 IST|Sakshi
మోదీపైనే అవినీతి మరకలు...

సురవరం సుధాకర్‌రెడ్డి
జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి  అన్నారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశం నుంచి అవినీతిని పారదోలుతానని చెబుతున్న ప్రధాని మోదీనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. ఆయన నల్లధనాన్ని పారదోలుతానని నీతులు చెబితే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. చంద్రబాబు మిత్రుడు శేఖర్‌రెడ్డికి రూ.100కోట్ల కొత్త నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ప్రపంచశాంతికి పోరాడుదాం: ‘అణుబాంబులు.. మారణా యుధాలు.. ఉగ్రవాదులు లేని నూతన శాంతి ప్రపంచం నిర్మాణం కోసం ప్రతిపౌరుడు కృషి చేయాలని, దీనికి ప్రభుత్వాల నుంచి మద్దతుకావాలని  సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కోరారు. వీటన్నింటికీ పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమ వుతుందన్నారు.

అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభను ఆయన ప్రారంభించారు. అప్పట్లో రాజ్యాలు.. నీళ్ల కోసం యుద్ధాలు జరిగితే ప్రస్తుతం మతాల కోసం దాడులు చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు ఆయుధాల కొనుగోలు కోసం కేటాయించే నిధుల్లో 10 శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజల ప్రగతికి ఖర్చు చేస్తే పేదరికం మాటే ఉండదన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి మాట్లా డుతూ ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు పోయి రాద్ధాంతాల కోసం ఒకరిపై మరొకరు విమర్శలకు దిగుతున్నారన్నారు. మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు