గ్యాస్ సమస్యలకు ఉత్తమ పరిష్కారం..

8 Dec, 2014 23:00 IST|Sakshi
గ్యాస్ సమస్యలకు ఉత్తమ పరిష్కారం..

కోలన్ హైడ్రోథెరపీ!

పదేళ్ల నుంచి మలద్ధకంతో బాధపడుతున్న 40 ఏళ్ల రమేష్‌కి ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు. కారణం...? 42 సంవత్సరాల హరిత ఒకప్పుడు ఆహారం సరిగా జీర్ణం కాక సతమతం అయిపోయేది. తరచూ గ్యాస్ సమస్యతో, కడుపు ఉబ్బరంతో బాధపడుతూ ఉండేది. ఈ సమస్యలతో నలుగురిలోకి వెళ్లాలన్నా సంశయించే హరిత ఇప్పుడు చాలా రిలాక్స్‌గా ఉంటోంది. ఈ మార్పు వెనుక ఉన్నది....?
 రమేష్ హరితల సమస్యలకు మంచి పరష్కారాన్ని చూపించిన కొత్త చికిత్స కోలన్ హైడ్రో థెరపీ. మలబద్ధకం, గ్యాస్ సమస్య, ఇతర జీర్ణకోశ సమస్యలేమున్నా సరే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న కోలన్ హైడ్రోథెరపీ మంచి పరిష్కారం అందిస్తుంది. దీనికోసం ఖరీదైన మందులేవీ అక్కర్లేదు. స్వచ్ఛమైన గోరువెచ్చని నీరు చాలు. పెద్దపేగు లోపలికి ఈ నీటిని పంపించి దానిలో పేరుకుపోయి ఉన్న మలినాలను పూర్తిగా తొలగించి పేగు మొత్తాన్ని శుభ్రపరచడమే కోలన్ హైడ్రోథెరపీ. సహజసిద్ధంగా కండరాల్లో ఉండే సంకోచ వ్యాకోచాలను ఈ థెరీపీ మరింత మెరుగుపరుస్తుంది. శరీరంలో నుంచి మలినాలన్నీ వెళ్లిపోతాయి కాబట్టి దీనివల్ల శరీరం మొత్తం ఆరోగ్యవంతమవుతుంది.

 ఎలా పనిచేస్తుంది?

కోలన్ హైడ్రో థెరపీ అందించే పరికరాల్లో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. శుద్ధ్ గ్రావిటీ డీయూ-01 వీటిలో ఒకటి. ఈ పరికరంలో నీరు వివిధ దశల్లో ఫిల్డర్ అవుతుంది. అంతేగాక అల్ట్రా వయొలెట్ వాటర్ ఆ తరువాతే రెక్టమ్ ద్వారా లోపలికి వెళ్లి ఆ వీరు నెమ్మదిగా పెద్దపేగును చేరుతుంది. ఈ నీరు దేని ద్వారా కూడా పంపు చేయబడదు. కేవలం గురుత్వాకర్షణ బలంతో మాత్రమే లోపలికి ప్రవహిస్తుంది. సురక్షితమైన, స్వచ్ఛమైన, నియంత్రిత ఉష్ణోగ్రతతో నీరు పెద్దపేగును చేరుతుంది. గోరువెచ్చని (37.5 డిగ్రీ) నీరు పెద్దపేగును చేరగానే సహజసిద్ధంగా మలినాలతో సహా బయటకు వచ్చేస్తుంది. మృదువుగా మారిన మలినాలన్నీ కింద ఉన్న కోలన్ హైడ్రోథెరపీ టేబుల్ కిందకు చేరుతాయి. ఇదంతా పూర్తవడానికి 40 నిమిషాల సమయం పడుతుంది. వాసనను బయటికి పంపించే వ్వవస్థ కూడా దీనిలో ఉంటుంది కాబట్టి చికిత్స జరిగేటప్పుడు ఎటువంటి దుర్వాసన రాదు. ఈ ప్రక్రియ కోసం డిస్పోజబుల్ రెక్టల్ నాజిల్స్‌ను ఉపయోగిస్తారు. ఈ చికిత్స చేయించుకోవడానికి రెండు గంటల ముందు వరకు ఏమీ తినకూడదు. కోలన్ హైడ్రోథెరపీ ఎన్నిసార్లు చేయించుకోవాలనేది పేషెంటు అరోగ్య పరిస్థితులను బట్టి ఉంటుంది. ఈ చికిత్స ఇప్పుడు వారానికి ఒక రోజు నెలలో 5 సార్లు ఒక ప్యాకేజిగా అందుబాటులో ఉంది. వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఎటువంటి సమస్య లేనివాళ్లు  కూడా కోలన్ హైడ్రోథెరపీ చేయించుకోవచ్చు.
 
ఇవీ ఫలితాలు..

మలబద్ధక నివారణ, కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌కి మంచి పరిష్కారం. మలినాలతో పాటు హానికర బాక్టీరియా వెళ్లిపోతుంది కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం చేకూరు తుంది. ఇది నొప్పిలేని, సురక్షిత చికిత్సా పద్ధతి.
 
వీళ్లకి వద్దు...

గర్భిణులు, పెద్దపేగు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్
ట్రాక్ట్‌కి సంబంధించిన తీవ్రమైన సమస్యలున్నవాళ్లు
హార్ట్ ఫెయిల్యూర్ సమస్య ఉన్న వాళ్లు, రెక్టల్ క్యాన్సర్ ఉన్నవాళ్లు, అల్పరేటిన్ కోలైటిస్
తీవ్రమైన పైల్స్ (అర్శమొలలు) సమస్య ఉన్నవాళ్లు
 
రాజగోపాల్, డెరైక్టర్ శుద్ధ్ కోలన్ కేర్
 
 

మరిన్ని వార్తలు