ఆర్ అండ్ బీకి కొత్త ఇంజనీర్లు

27 Mar, 2016 05:05 IST|Sakshi
ఆర్ అండ్ బీకి కొత్త ఇంజనీర్లు

♦ 82 మందికి నియామక పత్రాలు అందజేసిన మంత్రి తుమ్మల
♦ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా కేటాయింపు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా రోడ్లు భవనాల శాఖకు ప్రభుత్వం కొత్త ఇంజనీర్లను కేటాయించింది. వీరిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) స్థాయిలో 82 మంది ఉన్నారు. శనివారం ఆర్‌అండ్ బీ శాఖ ప్రధాన కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరికి నియామక ఉత్తర్వులు అందజేశారు. 2012 తర్వాత ఈ శాఖకు కొత్త ఇంజనీర్లు రావటం ఇదే తొలిసారి. అప్పటి నుంచి చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేయాల్సిందిగా ఆ శాఖ, సీఎం దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించి 82 మంది అభ్యర్థులను ఏఈఈ పోస్టులకు ఎంపిక చేశారు.

కాగా, వీరందరిని వివిధ జిల్లాలకు కేటాయించారు. ఇక 42 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి మరో పరీక్ష నిర్వహించారు. వాటి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. శనివారం కేటాయించిన పోస్టుల్లో ఎస్సీలు 12 మంది, ఎస్టీలు నలుగురు, బీసీలు 33 మంది, వికలాంగుల కోటాలో ఒకరు, ఓసీలు 27 మంది ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక, నియామకాలు పూర్తి పారదర్శకంగా జరిగాయని ఆ శాఖ పరిపాలన వి భాగం ఈఎన్‌సీ భిక్షపతి పేర్కొన్నారు. కొత్త గా నియమితులైన ఇంజనీర్లకు వచ్చేనెల 4 నుంచి 3 నెలల పాటు న్యాక్‌లో శిక్షణ ఇస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు