జైలంటే జైలూ కాదు...

11 Jun, 2017 04:23 IST|Sakshi
జైలంటే జైలూ కాదు...
జైలనగానే ఊచలుండి, గాలి, వెలుతురు రాని నాలుగు గదుల గోడ, రుచీ పచీ లేని తిండి, చుట్టూ తుపాకులతో పోలీసులు, నిద్ర పట్టకుండా దోమలు, దుర్గంధం గుర్తొస్తాయి. కానీ నార్వేలోని బాస్టాయ్‌ జైలు ఇందుకు విరుద్ధం. ఆ జైలు పక్షుల దైనందిన జీవితం గురించి వింటే నేరం చేసి జైలుకు వెళితే బాగుం డునేమోననిపిస్తుంది. అక్కడి ఖైదీలు పోలీసులెవరూ లేకుండానే క్రమశిక్షణతో పొద్దున్నే లేస్తారు. వ్యాయామం చేస్తారు. జిమ్‌కు వెళతారు. అల్పాహారం తీసుకొంటారు. తర్వాత పక్కనే బీచ్‌లో సన్‌బాత్‌ చేస్తారు. నిబంధనల మేరకు గుర్రాలు, గొర్రెలు కాస్తారు. వ్యవసాయ పనులు చేస్తారు. జైల్లోపలికి వెళ్లి మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఖైదీలే తమకిష్టమైన ఆహారం వండుకొని తింటారు. ఈ బాస్టాయ్‌ జైల్లో కటకటాల గదులుండవు. చిన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ గదులుంటాయి.

ఖైదీలు తమకిష్టమైన గదుల్లో ఉండవచ్చు. మధ్యాహ్నం కాస్త విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ ఎవరి పనులకు వారు వెళతారు. సాయంత్రం బీచ్‌ ఒడ్డున బిచానా వేస్తారు. ఆనందంగా గడుపుతారు. మళ్లీ చీకటిపడేలోగా జైలుకు వస్తారు. రాత్రి భోజనం చేసి పడుకుంటారు. ఖైదీలు సముద్రంలో చేపలు పట్టుకోవచ్చు. సమీపంలోని గ్రౌండ్‌కు వెళ్లి ఫుట్‌బాల్‌ ఆడొచ్చు. జైలు సిబ్బంది, కాపలా తక్కువగా ఉంటుంది. అందుకనే ఖైదీలే ఓ కమ్యూనిటీగా జైల్లో కూడా అన్ని పనులు వంతులవారిగా చేసుకుంటారు. ఖైదీలకంటూ ప్రత్యేక బట్టలు ఉండవు.

ప్రపంచంలోనే అతి మంచి జైలుగా ప్రసిద్ధి చెందిన బాస్టాయ్‌ జైలులో భద్రతా సిబ్బంది అతి తక్కువగా ఉన్నప్పటికీ ఖైదీలెవరూ పారిపోవడానికి ప్రయత్నించరు. జైలు నుంచి విడుదలవడానికి 18 నెలల ముందు నుంచే బయట ఉద్యోగం చేసుకునే అవకాశం ఖైదీలకు ఉంటుంది. విడుదలయ్యాక వారు అదే ఉద్యోగంలో స్థిరపడిపోతారు. ఓ చిన్న దీవిలో ఉన్న ఈ జైలులో ప్రస్తుతం 115 మంది ఖైదీలు ఉన్నారు. ఘోర నేరాలు చేసిన వారిని నేరుగా ఈ జైలుకు తీసుకోరు. దేశంలోని వేరే జైల్లో కొంతకాలం శిక్ష అనుభవించి క్రమశిక్షణతో మెలిగినట్లు ధ్రువీకరణ పత్రం పొందటంతో పాటు ఈ జైలుకు రావాలని కోరుకుంటున్నట్లు దరఖాస్తు చేసుకుంటేనే అలాంటి నేరస్థులను ఇక్కడ అనుమతిస్తారు. నేరస్థుల్లో పరివర్తన తీసుకరావడమే ప్రధానంగా ఈ జైలు లక్ష్యం. వారికి జీవితం పట్ల అవగాహన కల్పించేందుకు అధ్యాపకులు వస్తారు. సెమినార్లు నిర్వహిస్తారు. మంచి గ్రంధాలయం కూడా వారికి అందుబాటులో ఉంది. 
 
కూలీ పనికి పోయేదాన్ని కాదు..
ఏడాది కిందట మూడెకరాలిచ్చారు. రికార్డుల్లో పేరు ఎక్కిస్తానని పట్వారి పట్టాలు తీసుకున్నాడు. హద్దులు చూపించిన వెంటనే పాసు పుస్తకాలు ఇస్తామన్నరు. ఇప్పటివరకూ హద్దులు చూపలేదు. కలెక్టర్‌ ఆఫీస్‌లో రెండు సార్లు సంప్రదించాం. వారంలో పని అయిపోతుందని సార్లు చెప్పారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. మా భూమికి హద్దులు చెప్తే దుక్కులు దున్ని సాగు పనులు చేసుకునేదాన్ని. ఖాళీగా ఉండలేక కూలీ పనికి పోతున్నా.  
- నర్సమ్మ, బాగాయిపల్లి, వికారాబాద్‌ జిల్లా
 
హద్దు రాళ్లు సిద్ధం చేసుకున్నా..
భూ పంపిణీ పథకం కింద నాకు 1.30 ఎకరాలు ఇచ్చారు. పాసు పుస్తకాలు, టైటిల్‌ ఇచ్చినప్పటికీ భూమి హద్దులు మాత్రం చూపించలేదు. దీంతో వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నాం. ‘సర్వే చేసి హద్దులు చూపిస్తాం రాళ్లు తెచ్చుకోండి’ అని సార్లు చెప్తే మరుసటి రోజే రాళ్లు తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకున్నా. కానీ సార్లు రాలేదు.. హద్దులు చూపలేదు. కాలం అయిపోయాక ఇస్తే మళ్లీ ఏడాది పాటు ఆగాల్సిందే.  
– తీగమళ్ల లక్ష్మి, నాగసముందర్, యాలాల మండలం, వికారాబాద్‌ జిల్లా
>
మరిన్ని వార్తలు