స్టాంప్ పేపర్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

22 Aug, 2016 17:19 IST|Sakshi

పాత స్టాంప్ పేపర్లు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. చంపాపేటకు చెందిన లతీఫ్ ఖాన్, మల్లారెడ్డి అనే వ్యక్తులు 70, 80 సంవత్సరాల పాత స్టాంప్ పేపర్లు విక్రయిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి 75 స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

మరిన్ని వార్తలు