దొరికిన దొంగను కాపాడటమా?

31 Aug, 2016 01:46 IST|Sakshi
దొరికిన దొంగను కాపాడటమా?

బాబు అనుకూల మీడియాపై మండిపడ్డ వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ
 
 సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబును నిందితుడిగా చేర్చే విషయమై దర్యాప్తు చేయాలని తీర్పు వస్తే కొన్ని పత్రికల్లో వార్తలు సరిగా వేయకపోవడం బాధాకరమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చిందన్నారు. బాబు దొరికిన దొంగ అని తెలిసినా కూడా ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించాయన్నారు. జాతీయ పత్రికలు కూడా బ్యానర్ స్టోరీగా ఇచ్చిన వార్తను.. బాబు అనుకూల పత్రికలు కనిపించకుండా లోపల ఎక్కడో ఇచ్చాయన్నారు. ముఖ్యమంత్రిని అవినీతి నిరోధక శాఖ మందలించినంత పని చేస్తే దాన్ని దాచేసే ప్రయత్నం చేసిన మీడియాకు ఇక మాట్లాడే హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు. స్విస్ చాలెంజ్ విధానంలో కూడా అలాగే చేశారన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో చంద్రబాబు తప్పుడు పని కూడా దొరతనం అవుతుందంటూ కప్పిపుచ్చడం మంచి పద్ధతి కాదని వాసిరెడ్డి పద్మ అన్నారు.

 దోచింది కాపాడుకోవడానికే..
 దోచింది కాపాడుకోవడానికి చంద్రబాబు కేంద్రాన్ని, అటార్నీ జనరల్‌ని వాడుకుంటున్నారని విమర్శించారు. కోర్టులు, కేంద్రం నియమించిన కేల్కర్ కమిటీ స్విస్ చాలెంజ్‌లో పారదర్శకత లేదని చెప్పినా వినకుండా చంద్రబాబు దాన్ని కొనసాగించాలనుకోవడం దారుణమన్నారు.

మరిన్ని వార్తలు