'చిన్నారుల కేసు విచారణ వేగం పెంచాం'

17 Jul, 2016 13:17 IST|Sakshi

హైదరాబాద్: ఇద్దరు మైనర్ విద్యార్థుల ఘర్షణ కేసులో విచారణ ముమ్మరం చేశామని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యానికి నోటీసులు ఇస్తామని అన్నారు. విచారణ వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 12న టోలిచౌకి ఐఏఎస్ కాలనీలోని ప్రామిసింగ్ స్కాలర్స్ హైస్కూల్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఒకటో తరగతి చదువుతున్న మహ్మద్ ఇబ్రహీం(6)... మూడో తరగతి విద్యార్థిని చీమిడి ముక్కోడా అని గేలి చేయడంతో ఆ కుర్రాడు తనను టీచ్ చేస్తావా అని మర్మాంగాలపై తన్నాడు. కుప్పకూలిన ఇబ్రహీంను ఇంటికి వెళ్లిన తర్వాత నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పురుషాంగం, కడుపు ప్రాంతాల్లో శస్త్రచికిత్సలు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజాము 3 గంటలకు చిన్నారి మరణించినట్టు వైద్యులు తెలిపారు. కారు డ్రైవర్‌గా పనిచేసే ఇబ్రహీం తండ్రి ముజీబ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు