'ఎవ్వరినీ వదలం.. వనజాక్షి పరిధి దాటారు'

21 Dec, 2015 12:42 IST|Sakshi
'ఎవ్వరినీ వదలం.. వనజాక్షి పరిధి దాటారు'

హైదరాబాద్: కాల్ మనీ సెక్స్ రాకెట్ విచారణలో నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తప్పుచేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. సోమవారం ఆయన శాసనమండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ కాల్ మనీ సెక్స్ రాకెట్ పై ఎవరిపట్ల సానుభూతితో వ్యవహరించబోమని, ఎవరిదగ్గరైనా ఆధారాలు ఉంటే ఇవ్వొచ్చని అన్నారు. మీడియా కూడా ఇష్టారీతితో వ్యవహరించకూడదని హితవు పలికారు. 

ఈ వ్యవహారంలో మీడియాకు కూడా నోటీసులు పంపిస్తామని, ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని కోరుతామని, అలా ఇవ్వలేకపోతే బాధ్యతగా వ్యవహరించాలని చెప్తామని అన్నారు. దీంతోపాటు తహసీల్దార్ వనజాక్షి వ్యవహారంపై కూడా చంద్రబాబునాయుడు స్పందించారు. వనజాక్షి పరిధిదాటి వ్యవహరించారని అన్నారు. ఆఫీసర్ వచ్చి దౌర్జన్యం చేస్తే వదిలిపెడతారా అని ఆయన ప్రశ్నించారు. అధికారులు హద్దుల్లో ఉండాలని సూచించారు. ఇసుక వ్యవహారంలో ఎమ్మెల్యే చింతమనేని తప్పు కూడా ఉందని చెప్పారు.

మరిన్ని వార్తలు