అగ్రిగోల్డ్‌ బాధితులకు జగన్‌ బాసట

15 Feb, 2017 02:17 IST|Sakshi
అగ్రిగోల్డ్‌ బాధితులకు జగన్‌ బాసట

విజయవాడలో మార్చి 3 నుంచి బాధితుల దీక్ష
సహకరించాలని విపక్ష నేతకు అసోసియేషన్‌ వినతి
ప్రభుత్వ నిర్లక్ష్యంతో 101 మంది చనిపోయారని ఆవేదన


సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ బాధితుల ఆందోళనకు విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంఘీభావం తెలిపారు. అగ్రిగోల్డ్‌ కస్ట మర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘ నేతలు, పెద్ద సంఖ్యలో బాధితులు మంగళవారం జగన్‌ను ఆయన నివాసంలో కలసి తమకు న్యాయం జరగడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందంటూ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే మార్చి 3 నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించామని, అందుకు సహకారం కావాలని వారు జగన్‌ను అభ్యర్థించారు. ఈ మేరకు వారు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో జగన్‌ తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ వైఖరితోనే సమస్య జటిలం
అగ్రిగోల్డ్‌ బాధితులకు యాజమాన్యమే అన్యాయం చేస్తోందని ఇంతకాలం భావించామని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే తమకు న్యాయం జరగడంలో జాప్యం జరుగుతోం దనేది స్పష్టం అవుతోందని అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.విశ్వనాథరెడ్డి, ప్రధాన కార్య దర్శి వి.తిరుపతిరావు చెప్పారు. ప్రభుత్వ వైఖరి వల్ల ఇప్పటికి 101 మంది చనిపో యారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లా డారు. అగ్రిగోల్డ్‌ సమస్య జటిలం కావడా నికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమని ఖాతా దారులంతా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను 20 నెలల క్రితమే జప్తు చేసినా వాటిని అమ్మకుండా ప్రకటనలు చేస్తూ ప్రభుత్వం ఈ సమస్యను మరింత జటిలం చేస్తోందన్నారు.

యాజమాన్యం లోని సీతారామ్‌ అనే వ్యక్తి బ్రహ్మంగారి మఠం వద్దగల భూములను అమ్ముకున్నా ఆయన్ను అరెస్టు చేయలేదన్నారు. అగ్రి గోల్డ్‌ ఆస్తులను వేలంలో కొనడానికి ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వమే ఆక్షన్‌లో పాల్గొని వాటిని తీసుకోవాలన్నారు. ప్రభు త్వమే చిన్న ఖాతాదారులకు బకాయిలు తక్షణం చెల్లించాలని, పెద్ద ఖాతాదారులకు హామీ పత్రాలు ఇవ్వాలని వారు కోరారు.  తమ పోరాటానికి మద్దతునివ్వాల్సిందిగా వైఎస్‌ జగన్‌ను కోరామని అందుకాయన స్పందించి మద్దతు పలికారని చెప్పారు. నిరాహార దీక్షా శిబిరాన్ని తానూ సందర్శిస్తానని భరోసా ఇచ్చారని వారు వివరించారు.

మరిన్ని వార్తలు