స‌ముద్రంలో కుప్ప‌కూలిన మిలిట‌రీ విమానం

1 May, 2020 08:35 IST|Sakshi

టొరంటో :  కెన‌డాకు చెందిన మిలిట‌రీ హెలికాప్ట‌ర్ స‌ముద్రంలో కుప్ప‌కూలింది. నాటో టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా ప్ర‌యాణించిన  హెలికాప్టరు గ్రీస్ లోని లోనియన్ సముద్రతీరంలో కుప్పకూలిందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడీ వెల్లడించారు.  ఈ దుర్ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో ఐదుగురు  గ‌ల్లంతు ఆయ్యార‌ని తెలిపారు. గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయ‌ని, వారంతా క్షేమంగా భ‌య‌ట‌ప‌డాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఆశాభావం వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంలో మృతిచెందిన వ్య‌క్తిని  మెరైన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ ఆఫీసర్ సబ్ లెఫ్టినెంట్ అబ్బిగైల్ కోబ్రౌగా గుర్తించిన‌ట్లు పేర్కొన్నారు.   (కెనడాలో కాల్పులు.. 16 మంది మృతి)

ఘ‌టన‌పై  కోబ్రౌ త‌ల్లి మాట్లాడుతూ..నా అంద‌మైన గారాల‌ప‌ట్టి న‌న్ను విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆమె స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు అంటూ వాపోయింది. హెలికాప్టరులో రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన నలుగురు సభ్యులతో పాటు మ‌రో ఇద్ద‌రు సెన్సార్ ఆప‌రేట‌ర్లు ఉన్నార‌ని అధికారులు వెల్ల‌డించారు. వీరి కుటుంబాల‌కు ప్రాథ‌మికంగా స‌మాచారం అందించామ‌ని, అయితే రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు.  (కెనడా ప్రధాని.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ )

మరిన్ని వార్తలు