సిరియాలో బాంబు దాడులు.. 14 మంది మృతి

4 Jun, 2015 20:29 IST|Sakshi
సిరియాలో బాంబు దాడులు.. 14 మంది మృతి

బీరట్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడులతో దద్దరిల్లే సిరియా మరోసారి బాంబు పేలుళ్లతో మార్మోగింది. సిరియాలో వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగి సుమారు 14 మృతిచెందినట్లు సమాచారం. మృతులలో 5 మంది చిన్నారులు ఉన్నారని సిరియా మానవ హక్కుల సంఘం తెలిపింది. ఉత్తర సిరియా లోని అలెప్పో ప్రాంతంలో స్థానిక ప్రభుత్వ హెలికాఫ్టర్ల నుంచి శక్తివంతమైన బాంబులను వేయడంతో ఈ నష్టం సంభవివంచిందని మానవ హక్కుల కార్యకర్త ఒకరు వెల్లడించారు.

ఉత్తర సిరియాలోని డేర్ జమల్ ప్రాంతంలో వైమానిక ముట్టడిలో భాగంగా బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ సహా 8 మంది మృతిచెందారని ఓ ఎన్జీఓ తెలిపారు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. మరియా, అలెప్పో ప్రాంతాలలోనూ సిరియా తిరుగుబాటుదారులు బాంబు దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. అయితే, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చెలరేగుతోన్న ఉత్తర సిరియాలో వారిని ఎదుర్కొనేందుకు సిరియా ప్రభుత్వం ఎయిర్ క్రాఫ్ట్, హెలికాఫ్టర్లు ఉపయోగించి బాంబు దాడులకు పాల్పడిందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు