భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

20 Nov, 2017 08:43 IST|Sakshi

నౌమియా : న్యూ కెలడోనియా తూర్పు తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ మేరకు అమెరికన్‌ జియోలాజికల్‌ సర్వే ఓ ప్రకటన విడుదల చేసింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్టేలుపై 7.0గా నమోదైనట్లు తెలిపింది. దేశంపై సునామీ దాడి జరిగే అవకాశం ఉందని పసిఫిక సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

సునామీ వల్ల 300 కిలోమీటర్ల పరిధిలో విధ్వంసం జరగుతుందని హెచ్చరించింది. న్యూ కెలడోనియాలో తూర్పు తీరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఆ దేశ రాజధాని నౌమియా ఉంది. సోమవారం ఉదయం భూకంపం సంభవించే ముందు న్యూ కెలడోనియాలో ఆదివారం అర్థరాత్రి పలుమార్లు భూమి కంపించినట్లు రిపోర్టులు వచ్చాయి.

మరిన్ని వార్తలు