Earthquake: అసోంలో భూకంపం

1 Oct, 2023 07:40 IST|Sakshi

అసోంలోని ధుబ్రిలో ఈరోజు (ఆదివారం) తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అసోంలోని ధుబ్రిలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సంభవించినప్పుడు జనం గాఢ నిద్రలో ఉన్నారు. 

భూ ప్రకంపనలను గుర్తించిన వెంటనే జనం తమ ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. భయంతో ఇళ్ల వెలుపలే చాలా సేపు ఉన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం తెల్లవారుజామున 3.01 గంటలకు 17 కి.మీ లోతులో సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైంది. 

గత సోమవారం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదైంది. సెప్టెంబర్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, చంబా జిల్లాల్లో రిక్టర్ స్కేల్‌పై 2.8, 2.1 తీవ్రతతో తేలికపాటి భూకంపాలు సంభవించాయి. కాగా తాజాగా సంభవించిన భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు?
 

మరిన్ని వార్తలు