పరుగు పందెంలో 8 వ నెల గర్భవతి

27 Jun, 2014 12:40 IST|Sakshi
పరుగు పందెంలో 8 వ నెల గర్భవతి

పుట్టబోయే బిడ్డకి చెప్పుకునేందుకు ఆ తల్లి దగ్గర ఓ గొప్ప కథ ఉంది!


'బుజ్జి కన్నా... ఎనిమిదో నెల గర్భంతో నిన్ను మోస్తూ నేను 800 గజాలు పరుగెత్తానురా' అని ఆమె తన పిల్లవాడికి చెప్పుకోవచ్చు.
800 మీటర్ల పరుగుపందెంలో అయిదు సార్లు అమెరికన్ ఛాంపియన్ గా నిలిచిన అలీషియా మోంటానో కొత్త చరిత్ర సృష్టించింది. ఎనిమిదో నెల గర్భంతో ఆమె జాతీయ ఛాంపియన్ షిప్ లో పాల్గొంది. ఆమె పోటీలో అందరికన్నా ఆఖరుగా నిలిచింది. కానీ అందరికన్నా ఎక్కువ చప్పట్లను పొందింది ఆమే! యావత్ స్టేడియం లేచి నిల్చుని ఆమెను అభినందించింది. ఆఖరికి ఛాంపియన్ షిప్ గెలిచిన వారు కూడా ఆమెనే ప్రశంసించారు.


గర్భిణీ స్త్రీలు వ్యాయామం చేయాలన్న అంశానికి ప్రచారం కల్పించేందుకే ఆమె ఈ సాహసానికి పూనుకుంది. మామూలుగా చాలా మంది గర్భవతులు విశ్రాంతి పేరిట కాయకష్టాన్ని పూర్తిగా ఆపేస్తారు. కానీ అలీసియా గర్భవతి అయినప్పటి నుంచీ పరుగు ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. ఛాంపియన్ షిప్ లో పాల్గొనడానికి ఆమె వైద్యుల అనుమతి తీసుకుంది.


పరుగుల రాణికి పుట్టిన ఆ బిడ్డ పరుగుల యువరాజు అయితీరతాడేమో!
 

మరిన్ని వార్తలు