'ఎయిర్ పోర్ట్ ఖాళీ చేయించారు'

1 Jan, 2016 18:46 IST|Sakshi
'ఎయిర్ పోర్ట్ ఖాళీ చేయించారు'

ఆమ్స్టర్డామ్: ఓ వ్యక్తి 'నా దగ్గర బాంబు ఉంది' అని అరవడంతో అధికారులు విమానాశ్రయాన్ని ఖాళీ చేయించిన ఘటన నెదర్లాండ్స్ లో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఆమ్స్టర్డామ్ లోని స్చిపోల్ విమానాశ్రయం ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఆ సమయంలో బ్రిటన్కు చెందిన 29 ఏళ్ల ఓ వ్యక్తి హఠాత్తుగా.. నా దగ్గర బాంబు ఉంది అని అరిచాడు. దీంతో భద్రతా అధికారులు అప్రమత్తమై ప్రయాణికులను ఖాళీ చేయించారు.

అధికారులు స్నిఫర్ డాగ్లను రంగంలోకి దింపి సదరు వ్యక్తి లగేజ్ను చెక్ చేయించారు. అయితే అతడి వద్ద ఎలాంటి విస్పోటక పదార్థాలు లభించలేదు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని..  అలా ఎందుకు ప్రవర్తించాడు అన్న దానిపై విచారణ జరుపుతున్నారు.  సుమారు 20 నిమిషాల అనంతరం ఎలాంటి బాంబు లేదని నిర్థారించుకున్న తరువాత ప్రయాణికులను విమానాశ్రయంలోకి అనుమతిచ్చారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఉగ్రవాద దాడులు జరగొచ్చనే హెచ్చరికలతో పలు యూరప్ దేశాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి.
 

మరిన్ని వార్తలు