ఈక్వెడార్లో మరోసారి భూకంపం

22 Apr, 2016 09:57 IST|Sakshi
ఈక్వెడార్లో మరోసారి భూకంపం

క్వీటో: ఈక్వెడార్లో మరోసారి భూకంపం వచ్చింది. శుక్రవారం ఈక్వెడార్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.0గా నమోదు అయింది. ఇదిలా ఉంటే.. గతవారం ఈక్వెడార్లో సంభవించిన భూకంపం ధాటికి శుక్రవారం మృతుల సంఖ్య 587కు చేరుకుంది. వారిలో 539 మంది మృతదేహాలను వారి కుటుంబసభ్యులు గుర్తించారని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో 48 మృతదేహాలను గుర్తించవలసి ఉందన్నారు.

అయితే మృతుల్లో 27 మంది విదేశీయులు ఉన్నారని తెలిపారు. వారిలో 10 మంది కొలంబియన్... ఆరుగురు క్యూబా... ఇద్దరు కెనడా... ఇద్దరు డొమినిక్ రిపబ్లిక్.... ఇద్దరు బ్రిటన్ దేశాలకు చెందినవారు కాగా.. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారని... మరోక మృతదేహాన్ని గుర్తించవలసి ఉందని వివరించారు. ఈ భూకంపంలో 5733 మంది గాయపడ్డారు. వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. 163 మంది ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదని తెలిపారు.

>
మరిన్ని వార్తలు