Salaar: Part 1 Movie Censor: 'సలార్' మూవీకి ఆ సర్టిఫికెట్.. రన్ టైమ్ ఎంతో తెలుసా?

9 Dec, 2023 19:10 IST|Sakshi

డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మూవీ 'సలార్'. పలుమార్లు వాయిదాపడ్డ ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. కొన్నిరోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేయగా.. మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు సెన్సార్ రిపోర్‌ మాత్రం.. అంచనాలు పెంచేలా కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!)

డిసెంబరు 1 ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇందులో ప్రభాస్ లేట్ ఎంట్రీతో పాటు యాక్షన్ తప్పితే పంచ్ డైలాగ్స్ లాంటివి లేకపోవడంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమే. దీంతో రాబోయే వీకెండ్.. ప్రభాస్ మాత్రమే ఉండేలా ఓ యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. దీనికి తోడు 'సలార్' సెన్సార్ పూర్తయిందనే న్యూస్ వైరల్ అయిపోయింది.

సెన్సార్ రిపోర్ట్ ప్రకారం 'సలార్' మూవీ నిడివి.. 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లు అని తెలుస్తోంది. అలానే 'A' సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. అంటే 18 ఏళ్ల నిండని వాళ్లు.. ఈ మూవీ చూడటం కుదరదు. అదే టైంలో సినిమాలోని ప్రభాస్ ఎంట్రీ కూడా అరగంట తర్వాతే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. తొలుత అరగంట పాటు కన్సర్ ప్రపంచాన్ని.. జగపతిబాబు-పృథ్వీరాజ్ పాత్రల్ని ఎష్టాబ్లిష్ చేస్తారని సమాచారం. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు)

>
మరిన్ని వార్తలు