రాకెట్‌ ప్రమాదం.. వ్యోమగాములు సేఫ్‌

11 Oct, 2018 16:59 IST|Sakshi

న్యూయార్క్: ఇద్దరు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్‌) తీసుకెళ్తున్న రష్యాకు చెందిన సూయజ్ రాకెట్ సాంకేతిక కారణాల వల్ల కజకిస్థాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా బయటపడ్డారని నాసా ఉన్నతాధికారి జిమ్‌ బ్రిడెన్‌స్టైన్‌ తెలిపారు.

సూయజ్ రాకెట్‌లో రష్యాకు చెందిన వ్యోమగామి అలెక్సీ ఓవ్‌చినిన్, అమెరికా వ్యోమగామి నిక్ హగ్‌లు ప్రయాణిస్తుండగా రాకెట్ బూస్టర్‌లో సమస్య తలెత్తింది. దీంతో ఆ ఇద్దరు వ్యోమగాములు బాలిస్టిక్ డీసెంట్ మోడ్‌లో తిరిగి భూమిపైకి వచ్చినట్లు నాసా పేర్కొంది. సాధారణ ల్యాండింగ్ కంటే ఇది కాస్త వేగంగా జరిగే ల్యాండింగ్ అని నాసా తెలిపింది. సూయజ్ రాకెట్‌లో ఆరు గంటల పాటు ప్రయాణించి ఐఎస్‌ఎస్‌కు చేరాల్సి ఉంది. వీళ్లు ఆరు నెలల పాటు స్పేస్ స్టేషన్‌లో ఉండాల్సి ఉంది. ప్రస్తుతం వాళ్లు ల్యాండైన ప్రదేశానికి రెస్క్యూ టీమ్స్ వెళ్తున్నాయి. నాసా ట్విట్‌ చేసిన వీడియోలో రాకెట్‌ తన మార్గాన్ని మరల్చుకుని తిరిగి భూమివైపు రావడం కనిపిస్తోంది.
 

మరిన్ని వార్తలు