వరల్డ్ లాంగెస్ట్ డైరెక్ట్ విమాన సర్వీసు

28 Jan, 2016 18:56 IST|Sakshi
వరల్డ్ లాంగెస్ట్ డైరెక్ట్ విమాన సర్వీసు

ఖతార్: ఏకబిగిన 18 గంటల పాటు విమానంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది. వరల్డ్ లాంగెస్ట్ డైరెక్ట్ విమాన సర్వీసులో ప్రయాణించి తెలుసుకోవాల్సిందే. ఇప్పటివరకు అత్యధికంగా 16 గంటల 55 నిమిషాలు ఏకబిగిన ప్రయాణించే వీలుంది. ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు ఖతార్ ఎయిర్ వేస్ సిద్ధమవుతోంది.

ఎక్కువసేపు ప్రయాణించే డైరెక్ట్ విమాన సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దోహ నుంచి ఆక్లాండ్ కు నేరుగా విమాన సర్వీసు నడిపేందుకు ఖతార్ ఎయిర్ వేస్ ప్రయత్నిస్తోందని 'ది గార్డియన్‌' వెల్లడించింది. దోహా నుంచి ఆక్లాండ్ కు 9,034 మైళ్ల దూరం ఉంది. ఎక్కడా ఆగకుండా విమానంలో వెళితే 18 గంటల 34 నిమిషాలు పడుతుంది.

డల్లాస్-సిడ్నీ ప్రయాణ సమయంతో పోలిస్తే ఇది 2 గంటలు ఎక్కువ. ఈ మార్గంలో ఖంటాస్ సంస్థ డైరెక్ట్ విమాన సర్వీసు నడుపుతోంది. 8,578 మైళ్ల దూరం ప్రయాణించడానికి  16 గంటల 55 నిమిషాల సమయం పడుతోంది. దోహ-ఆక్లాండ్ డైరెక్ట్ సర్వీసుకు 259 ప్రయాణికుల సామర్థ్యం కలిగిన బోయింగ్ 777-ఎల్ ఆర్ విమానాన్ని నడపాలని ఖతార్ ఎయిర్ భావిస్తోంది. వరల్డ్ లాంగెస్ట్ డైరెక్ట్ విమాన సర్వీసు పట్ల ప్రయాణికులు ఎలా స్పందిస్తారో చూడాలి.
 

మరిన్ని వార్తలు