స్వలింగ వివాహాలకు చట్టబద్దత

15 Nov, 2017 12:14 IST|Sakshi
స్వలింగ వివాహాలు(ఫైల్‌ ఫొటో)

సిడ్నీ : స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలా? వద్దా? అనే అంశంపై ఆస్ట్రేలియా సమాజం ఓటెత్తింది. 61 శాతం మంది ఆస్ట్రేలియన్లు స్వలింగ వివాహాలకు చట్టబద్దత ఇవ్వాలని తీర్పునిచ్చారు. స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తూ కేవలం 38.4 శాతం ఓట్లే పోల్‌ అయ్యాయి. దాదాపు రెండు నెలలు పాటు సాగిన సర్వేలో కోటి 27 లక్షల మంది ఆస్ట్రేలియన్లు పాల్గొన్నారు. 

ఆస్ట్రేలియా అధ్యక్షుడు మాల్కోమ్‌ టర్నబుల్‌ మాట్లాడుతూ స్వలింగ వివాహాలకు మద్దతుగా తాను ఓటేసినట్లు చెప్పారు. కాగా, ఓటరు తీర్పుతో ఆస్ట్రేలియా పార్లమెంటు గురువారం స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించనుంది. దీంతో క్రిస్‌మస్‌ పర్వదినం నాటికి స్వలింగ వివాహాలకు చట్టబద్దత వచ్చే అవకాశం ఉంటుంది. 

సర్వే ఫలితాలు వెలువడిన అనంతరం ఆస్ట్రేలియన్లు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. ఇదిలావుండగా, స్వలింగ వివాహాం చేసుకునే వారి పెళ్లిళ్లకు సామగ్రి సరఫరా చేయాలా? వద్దా? అనే విషయాన్ని వ్యాపారులకు వదిలేసే వెసులుబాటును చట్టంలో చేర్చాలని కొందరు కన్జర్వేటివ్‌ ఎంపీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు