ప్రపంచంలోనే తొలి కృత్రిమ క్లోమగ్రంధి అమరిక!

22 Jan, 2015 09:48 IST|Sakshi
ప్రపంచంలోనే తొలి కృత్రిమ క్లోమగ్రంధి అమరిక!

సిడ్నీ:  వైద్య చరిత్రలో మరో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలి కృత్రిమ క్లోమ గ్రంధిని ఆస్ట్రేలియా డాక్టర్లు విజయవంతంగా  అమర్చారు. గత కొంతకాలంగా డయాబెటీస్ తో బాధపడుతున్నఏవియర్ హేమ్స్ అనే నాలుగేళ్ల  బాలుడికి కృత్రిమ క్లోమగ్రంధిని అమర్చారు.  ఆ బాలుని రక్తంలో గ్లూకోజ్ శాతం గణనీయంగా పడిపోవడంతో తీవ్రమైన బాధతో కొట్టుమిట్టాడతున్నాడు.  దీంతో ఆ బాలున్ని తల్లి దండ్రులు పెర్త్ మార్గెరెట్ ఆస్పత్రిలో చేర్పించారు.

 

చికిత్సలో భాగంగా డాక్టర్లు ఆ బాలునికి క్లోమ గ్రంధి మాదిరిగా పనిచేసే కృత్రిమ గొట్టాన్ని అమర్చారు. దీని ద్వారా ఆ బాలుని  రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని తెలుసుకునే వీలుంటుంది. శరీరంలో సుగర్ లెవిల్స్ పడిపోయేనప్పుడే కాకుండా ఇన్సులిన్ విడుదల కావడం పూర్తిగా ఆగిపోయినప్పుడు ఈ గొట్టం పసిగట్టి సమాచారాన్ని అందిస్తోంది.  దీంతో వారి తల్లి దండ్రులకు ఆ బాలుని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుందని ఆ ఆస్పత్రి ప్రొఫెసర్ టిమ్ జోన్స్ చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు