సోషల్ మీడియాలో 'కొత్త హీరో' హల్ చల్

29 Jul, 2015 10:40 IST|Sakshi
సోషల్ మీడియాలో 'కొత్త హీరో' హల్ చల్

న్యూయార్క్: సోషల్ మీడియాలో ఓ గుడ్ల గూబ హల్ చల్ చేస్తోంది. ట్విట్టర్లో సెలెబ్రిటీగా మారిపోయింది. దీని ఫొటోకు 3 వేలకు పైగా రీ ట్వీట్లు రాగా.. వీడియోను 32 లక్షల మంది చూశారు. ఇంతకీ విషయం ఏంటంటే..

అమెరికాలోని కొలరడొలో బోల్డర్ కౌంటీ షరీఫ్ అధికారి సోఫీ బర్మన్ పెట్రోలింగ్కు వెళ్లినపుడు ఓ గుడ్ల గూబ పిల్ల కనిపించింది. అది పక్కకు తప్పుకోకుండా రోడ్డుపై అలాగే నిలబడింది. బర్మన్ ఆ పక్షికి దగ్గరగా కూర్చుని పలకరించారు. దానికి ప్రతిగా ఆ గుడ్ల గూబ వంగుతూ,  రెండు చెవులతో వింటున్నట్టుగా విచిత్రమైన హావభావాలు చేసింది. అనంతరం అక్కడి నుంచి ఎగిరిపోయింది. ఈ పక్షిని చూసి ముచ్చట్టపడ్డ ఆ అధికారి ఈ తతంగాన్నంతా వీడియో తీసి ట్విట్టర్లో ఉంచారు. ఈ వీడియోకు ఊహించని స్పందన వచ్చింది. ఈ పక్షి సోషల్ మీడియాలో హీరోగా హల్ చల్ చేస్తోంది.
 

మరిన్ని వార్తలు