‘రక్త జలపాతం’ గుట్టు రట్టు!

7 May, 2017 01:20 IST|Sakshi
‘రక్త జలపాతం’ గుట్టు రట్టు!

వాషింగ్టన్‌: అంటార్కిటికాలోని ‘ఎర్ర జలపాతం’ రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. అక్కడి నీరు రక్తంలాగా ఎర్రటి రంగులో ప్రవహించడానికి కారణం ఆ నీటిలోని ఇనుము గాలితో కలవడమేనని  వర్సిటీ ఆఫ్‌ అలస్కా ఫెయిర్‌బ్యాంక్స్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు.

తూర్పు అంటార్కిటికాలోని ఈ ‘రక్త జలపాతాన్ని’ 1911లో గుర్తించారు. ఈ జలపాతం నీటిలోని ఇనుము గాలితో కలసినపుడు నీటి రంగు ఎరుపులోకి మారుతోందని, తద్వారా ఎరుపు రంగులో జలం ప్రవహిస్తోందని తమ పరిశోధనలో తేలిందని యూఏఎఫ్‌కు చెందిన క్రిస్టినా తెలిపారు.

మరిన్ని వార్తలు