విటమిన్‌–‘డి’తో ఉబ్బసానికి చెక్‌ 

5 Oct, 2017 01:52 IST|Sakshi

శరీరంలో తగు మోతాదుల్లో విటమిన్‌ ‘డి’ ఉండటం వల్ల ఉబ్బస వ్యాధి నుంచి కొంత రక్షణ పొందొచ్చని లండన్‌లోని క్వీన్‌ మేరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది ఉబ్బస వ్యాధితో బాధపడుతుంటే ఏటా దాదాపు 4 లక్షల మంది మరణిస్తున్నారు. వైరస్‌ లేదా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ బారిన పడటం వల్ల ఉబ్బసానికి గురై మరణించే వారు ఎక్కువగా ఉంటున్నారు. దీన్ని విటమిన్‌ ‘డి’ద్వారా తగ్గించుకోవచ్చని క్వీన్‌ మేరీ వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ద్వారా తెలిసింది.

విటమిన్‌ ‘డి’తీసుకోవడం వల్ల ఉబ్బసం 30 నుంచి 50 శాతం వరకు తగ్గినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉబ్బసానికి తీసుకునే మందులకు అదనంగా ఈ విటమిన్‌ను తీసుకోవాల్సి ఉంటుందని పరిశోధనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ అడ్రియన్‌ మార్టిన్యూ వివరించారు. విటమిన్‌ ‘డి’తీసుకున్న వారిలో అధిక క్యాల్షియం నిల్వలు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడలేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు