ఫేస్బుక్ వ్యసనపరుల కోసం క్లినిక్!

7 Jun, 2016 14:33 IST|Sakshi
ఫేస్బుక్ వ్యసనపరుల కోసం క్లినిక్!

కాన్స్టాంటిన్: ఇంటర్నెట్ ప్రపంచంలో ఫేస్బుక్కు ఉన్నటువంటి ఆదరణ, ఆకర్షణ మరే ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్కు లేదనే చెప్పాలి. అయితే దీనిని పరిమితంగా వాడినంత వరకు పరవాలేదు గానీ.. శృతి మించితే మాత్రం మత్తుపదార్దాలకు బానిసైన వారికంటే ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికోసం చికిత్స అందించడానికి ఫేస్ బుక్ డీఅడిక్షన్ క్లినిక్లు వెలుస్తున్నాయి.  

అల్జీరియాలోని కాన్స్టాంటిన్లో ఇటీవలే ఓ ప్రైవేట్ క్లినిక్ను తెరిచారు. అయితే ఆ క్లినిక్ అందించే సేవల లిస్ట్లో మత్తు పదార్థాలకు(డ్రగ్స్) బానిసైన వారు, ఆల్కహాల్ వ్యసనపరులతో పాటు..  ఫేస్బుక్ బాధితులకు  కూడా చికిత్స అందించబడుతుందని తెలిపారు. ఫిజికల్ డ్రగ్స్ కంటే ఎక్కువగా ఈ ఫేస్బుక్ వ్యసనపరులకు చికిత్స అవసరమని క్లినిక్ డాక్టర్ రవుఫ్ బొకాఫా వెల్లడించారు. అల్జీరియాలో ఇప్పటికే 10 మిలియన్ల ఫేస్బుక్ యూజర్లు ఉండగా, ఈ సంఖ్య ఏడాదికి 10 శాతం చొప్పున పెరుగుతోంది. దీంతో ఫేస్బుక్ బాధితులతో క్లినిక్కు బాగానే ఆదరణ లభిస్తోందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫేస్బుక్ బాధితులను.. 'బ్లూ మ్యాజిక్'  బారిన పడిన వారిగా ఇక్కడి క్లినిక్లో ట్రీట్చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు