భూమి అంతం : ఏప్రిల్‌ 23..?

14 Apr, 2018 10:34 IST|Sakshi
భూమి అంతరించే సమయంలో ఇలా ఉంటుందంట

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : భూమి మీద ప్రాణికోటికి మరో పదిరోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల 23న భూమి అంతరించనున్నట్లు ‘డేవిడ్ మీడే’ ప్రకటించారు. ఈ లోపు జీవితంలో మిగిలి ఉన్న చిన్న చిన్న కోరికలను నెరవేర్చుకొండి అంటున్నారు మీడే. గత కొద్ది నెలలుగా భూమి అంతరిస్తుందని తరచూ హెచ్చరికలు చేస్తున్న కాన్‌స్పిరసీ థియరిస్టు మీడే.

ఈయన మరోసారి భూమి అంతం కాబోతోందని ప్రకటించారు మీడే. ఈ సారి మాత్రం పాత ఉదాహారణలు అయిన నిబిరు, ప్లానెట్‌ ఎక్స్‌తో పాటు జోంబీ గ్రంథాన్ని కూడా ఆధారం చేసుకుని మరి ఈ ప్రకటన చేశాడు. ఈ సారి భూమి అంతం తప్పదంటున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా బైబిల్‌లో చెప్పిన ప్రకారం ఈ నెల 23న రాత్రి 12 గంటల ఒక నిమిషానికి ఈ విపత్తు సంభవించనున్నట్లు డేవిడ్ మీడే చెప్పారు.

దీని గురించి బైబిల్‌లో కూడా ఉందన్నారు. బైబిల్‌ ప్రకారం ప్రకారం క్రీస్తు పునరాగమనం జరుగుతుందని క్రైస్తవుల నమ్మకం. పునరాగమన సమయంలో చనిపోయిన వారు, బతికున్నవారు ఆకాశంలోకి వెళ్తారు. అక్కడ దేవుడు వారు భూమి మీద చేసిన మంచి, చెడు పనుల ప్రకారం వారి ఆత్మలను స్వర్గానికి లేదా నరకానికి పంపిస్తాడని నమ్మకం.

సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు ఒకే క్రమంలోకి వస్తారని అప్పుడు ఏవైనా ఉపద్రవాలు సంభవించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు కూడా అంటున్నారు. ఈ మూడు గ్రహాలు ఒకే క్రమంలోకి వచ్చినప్పుడు నిబిరు గ్రహం భూ కక్ష్యలోకి ప్రవేశించి భూమిని నాశనం చేస్తుందని డేవిడ్‌ మీడే అంటున్నారు.

మరిన్ని వార్తలు