శ్రీలంక పేలుళ్లపై ట్రంప్‌ ట్వీట్‌ వైరల్‌

21 Apr, 2019 17:44 IST|Sakshi

న్యూయార్క్‌ :  శ్రీలంక పేలుళ్లలో 13.8 కోట్ల (138 మిలియన్లు) మంది మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్‌తో అవాక్కవడం నెటిజన్ల వంతైంది. శ్రీలంక పేలుళ్లలో 138 మిలియన్ల మంది మరణించడం, 600 మందికి పైగా గాయపడటం పట్ల అమెరికా ప్రగాఢ సానుభూతి తెలుపుతోందని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. శ్రీలంక పేలుళ్లలో మరణాలు 200 లోపు ఉండటం, అక్కడి జనాభా 2.1 కోట్లు కావడం గమనార్హం. కాగా, ట్వీట్‌లో తన పొరపాటు తెలుసుకున్న ట్రంప్‌  ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేసేటప్పటికే అది వైరల్‌గా మారింది.

అటు తర్వాత మరో ట్వీట్‌లో మరణాల ముందు మిలియన్‌ పదాన్ని ఆయన వాడకపోవడంతో నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు. కొలంబో సహా మరో రెండు శ్రీలంక నగరాల్లోని ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, చర్చిలో జరిగిన బాంబు పేలుళ్లలో 160 మందికి పైగా మరణించగా, 300 మందికి పైగా గాయాలైన సంగతి తెలిసిందే. శ్రీలంకలో పేలుళ్లను భారత్‌, అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆపద సమయంలో​శ్రీలంకకు బాసటగా ఉంటామని సంఘీభావం ప్రకటించాయి.

మరిన్ని వార్తలు