కేరళ వరుస పేలుళ్లు: రూ. 3 వేలతోనే బాంబులు, గల్ప్‌లో ఉద్యోగం

31 Oct, 2023 11:57 IST|Sakshi

యూట్యూబ్‌లో చూసి బాంబుల తయారీ

దుబాయ్‌లో  ఫోర్‌మన్‌గా ఉద్యోగం

కేవలం రూ. 3వేలతో బాంబులు

కొచ్చిన్‌: దేశవ్యాప్తంగా కలకలం రేపిన కేరళ బాంబు పేళుళ్ల వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి  వచ్చాయి. వరుస పేలుళ్లకు పాల్పడిన నిందితుడు డొమినిక్‌ మార్టిన్‌  దీనికి సంబంధించి పోలీసుల ముందు సంచలన విషయాలను వెల్లడించాడు. కలమస్సేరిలోని జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పేలుళ్లకు బాధ్యత వహిస్తూ లొంగిపోయిన 28 గంటల తర్వాత, నిన్న (సోమవారం) అరెస్టయిన మార్టిన్‌ తాను ఏ విధంగా బాంబులు తయారు చేసిందీ, తన లక్ష్యం ఏమిటీ అనే వివరాలను పోలీసులకు వివరించినట్టు  సమాచారం.

తాజా సమాచారం ప్రకారం కొచ్చికి చెందిన డొమినిక్‌ మార్టిన్‌ ఇంటర్నెట్ నుంచి బాంబు తయారీ నేర్చుకున్నాడు. బాంబులను తయారు చేయడానికి  కేవలం 3 వేల రూపాయల ఖర్చు చేసినట్టు వెల్లడించాడు. గల్ఫ్‌లో ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న సమయంలో  బాంబులు తయారీ నేర్చుకున్నాడు. మార్టిన్ కుటుంబం ఐదేళ్లుగా కొచ్చి సమీపంలో అద్దెకు ఉంటోంది. పేలుళ్లకు రెండు నెలల ముందు మార్టిన్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చి పేలుళ్లకు పాల్పడ్డాడని  పోలీసు వర్గాలు తెలిపాయి. బాణాసంచా తయారీలో ఉపయోగించే తక్కువ గ్రేడ్  ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు (IEDలు)తో  ఈ బాంబును తయారు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

దాదాపు ఎనిమిది లీటర్ల పెట్రోలును త్రిపుణితుర నుంచి కొనుగోలు చేశాననీ, ఇతర మెటీరియల్స్, మందుగుండు సామగ్రిని కొనుగోలుకు సంబంధించిన సమాచారాన్ని కూడా వెల్లడించాడు. యూట్యూబ్  ద్వారా నేర్చుకుని,  తన ఇంట్లోనే  ఎసెంబుల్డ్‌ చేసి,  ఆదివారం ఉదయం 7 గంటలకు యెహోవా విట్నెస్‌  కన్వెన్షన్ సెంటర్‌లోని కుర్చీల కింద పెట్టాడు. ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నవారే లక్ష్యంగా  ప్లాస్టిక్ కవర్లలో పెట్రోల్ నింపిమొత్తం ఆరు చోట్ల ఉంచాడు.  అనంతరం వాటిని రిమోట్‌ కంట్రోల్‌తో  పేల్చివేశాడు.  అయితే వాటిల్లో మూడు బాంబులు పేలాయి. అంతేకాదు దీనికి  సంబంధించి లైవ్ వీడియోను కూడా  రికార్డు చేసినట్లు నిందితుడు తెలిపినట్టు సమాచారం. 

అలాగే లొంగిపోయే ముందు, మార్టిన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వీడియో సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు. సంబంధిత సంస్థ విద్రోహ పూరిత బోధన చేస్తోందని, సమాజం, పిల్లలకు తప్పుడు విలువలను ప్రచారం చేస్తోందనీ, పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో ఈ వరుస పేలుళ్లకు పాల్పడినట్టు పేర్కొన్నాడు. లొంగిపోయే ముందు, మార్టిన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వీడియో సందేశాన్ని కూడా పోస్ట్ చేశాడు. సంబంధిత సంస్థ విద్రోహపూరిత బోధన చేస్తోందని,  సమాజం, పిల్లలకు తప్పుడు విలువలను ప్రచారం చేస్తోందనీ, పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో  ఈ వరుస పేలుళ్లకు  పాల్పడినట్టు  పేర్కొన్నాడు. ఈ మార్టిన్ ఎఫ్‌బీ లైవ్ వీడియోను అప్‌లోడ్ చేసిన త్రిసూర్‌లోని లాడ్జీని కూడా పోలీసులు గుర్తించారు.

 జాతీయ దర్యాప్తుసంస్థ(ఎన్‌ఐఏ) నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందంమార్టిన్‌ ప్రశ్నిస్తోంది.  బాంబుల తయారీకి విడిభాగాలను కొనుగోలు చేయడానికి మార్టిన్ వెళ్లిన స్థలాలను పోలీసులు పరిశీలిచారు. దీనికి సంబంధించిన CCTV ఫుటేజీని సేకరించినట్లు తెలిసింది. మార్టిన్ మానసిక పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ  పేలుళ్లలో ఇతరుల ప్రమేయంపై కూడా పరిశీలిస్తున్నామని కొచ్చి కమిషనర్ ఎ అక్బర్ తెలిపారు.

కాగా  ఆదివారం (అక్టోబర్‌ 29) ప్రార్థనలు నిర్వహిస్తుండగా జరిగిన పేలుడులో ఒక చిన్నారితో సహా ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 52 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు