ఫేస్‌బుక్‌ కార్యాలయం ముందు నగ్న నిరసన

5 Jun, 2019 10:44 IST|Sakshi

న్యూయార్క్‌ : కళాత్మక నగ్నత్వంపై ఫేస్‌బుక్‌ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని #WeTheNipple పేరుతో వందల మంది మోడల్స్‌ న్యూయార్క్‌లోని ఆ కార్యాలయం ముందు నగ్న నిరసన చేపట్టారు. మగాళ్లు తమ చనుమొనలు చూపిస్తే ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు.. మహిళల చనుమొనలపై ఎందుకు ఆంక్షలు? అంటూ గొంతెత్తి అరిచారు. ఆడవాళ్ల చనుమొనలు ఫొటోలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వివాదాస్పద ఆర్టిస్ట్‌ స్పెన్సర్ తునిక్, నేషనల్ కోలిషన్ ఎగైనెస్ట్ సెన్సార్‌షిప్‌(ఎన్‌సీఏసీ)తో కలిసి ఈ ఉద్యమాన్ని చేపట్టాడు.

గత ఆదివారం న్యూయార్క్ వీధుల్లో మోడళ్లతో దుస్తులు విప్పించి ఆందోళనకు తెరతీశాడు. మన్‌హట్టన్‌లోని అస్టర్ ప్లేస్ సబ్‌వే స్టేషన్ వద్ద మోడళ్లు దుస్తులు విప్పేసి చనుమొనల చిత్రాలతో ఫొటోలకు పోజులిచ్చారు. వారి చనుమొనలకు పురుషుల చనుమొనల స్టిక్కర్లు అంటించుకొని.. వారి జననాంగాలు కనిపించకుండా చనమొనల ప్లకార్డుల అడ్డుపెట్టుకుని నిరసన తెలిపారు. ఇక ఫేస్‌బుక్‌లో కేవలం పెయింటింగ్‌ నగ్న చిత్రాలు మినహా ఫొటోలకు అనుమతి లేదు. వీడియో స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫాం యూట్యూబ్‌ సైతం తన నిబంధనలు మార్చుకుందని, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు ఏమైందని స్పెన్సర్‌ తునిక్‌ ప్రశ్నించారు. ఇది న్యూడ్‌ ఫొటోగ్రఫీ స్పూర్తిని దెబ్బతీయడేమనని వాపోయారు.
 

మరిన్ని వార్తలు