పైకెళ్లింది కింద పడాల్సిందే

11 Feb, 2015 18:26 IST|Sakshi
పైకెళ్లింది కింద పడాల్సిందే

ఢీల్లీ ఫలితాలపై విదేశీ మీడియా

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విదీశీ మీడియా ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు. అయితే గత పార్లమెంట్  ఎన్నికల్లో  మోదీ ప్రభావాన్ని దష్టిలో పెట్టుకొని ఈసారి ఆయన ప్రభావం ఎలా ఉంటుందన్న ఆసక్తితోనే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై ప్రపంచ మీడియా దృష్టి పెట్టింది.  అనూహ్యంగా ఆప్ సునామీనే సష్టించి 70 సీట్లలో 67 సీట్లను కైవసం చేసుకోవడంతో మంచి కవరేజీ ఇచ్చింది. ఆప్ ‘రాజకీయ భూకంపం’ సష్టించినట్లు వ్యాఖ్యానించడంతోపాటు ఆప్‌ను ప్రశంసించింది. ‘పైకెళ్లిన వస్తువు  కింద పడాల్సిందే’ అంటూ మోదీని ఉద్దేశించి విమర్శలు కూడా చేసింది.

ఆప్ సాధించిన ఫలితాలు పరిపాలనా వ్యవహారాల్లో, ఆర్థిక సంస్కరణలపై ప్రధాని మోదీపై తీవ్ర ఒత్తిడి పెంచిందని న్యూయార్క్ టైమ్స్ తన సంపాదకత్వంలో  వ్యాఖ్యానించింది. అయితే అమెరికా విదేశాంగ శాఖ మాత్రం ఈ ఫలితాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. భారత్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన అనంతరం ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడ్డాయని వ్యాఖ్యానించింది. అవినీతి ప్రక్షాళన నినాదంతో వచ్చిన ఓ సామాన్యుడి పార్టీ చేతిలో మోదీ పార్టీ దిగ్భ్రాంతికరమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. పెకైళ్లిన వస్తువు కింద పడాల్సిందేనంటూ న్యూటన్ భౌతికశాస్త్ర సూత్రాన్ని సీఎన్‌ఎన్ వ్యాఖ్యానించింది. మోదీకి ఇది మొదటి శరాఘాతం అని బీబీసి వ్యాఖ్యానించింది. మోదీకి ఇది పిడుగుపాటని లండన్ నుంచి వెలువడే ది టెలిగ్రాఫ్ వ్యాఖ్యానించింది.
 

మరిన్ని వార్తలు