కమల, కృష్ణమూర్తి విజయకేతనం

9 Nov, 2016 12:30 IST|Sakshi
కమల, కృష్ణమూర్తి విజయకేతనం

కాలిఫోర్నియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ మహిళ, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. తొలి ఇండియన్‌-అమెరికన్ సెనేటర్‌గా ఎన్నికైన ఘనత దక్కించుకున్నారు. అధి​కార డెమోక్రాటిక్‌ పార్టీ తరపున పోటీ చేసిన ఆమె తన సమీప ప్రత్యర్థి, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి లోరెట్టా శాన్‌చెజ్ పై విజయం సాధించారు. 51 ఏళ్ల కమల... అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఉపాధ్యక్షుడు జో బిడెన్ మద్దతుతో బరిలోకి దిగారు. కమల తల్లి 1960లో చెన్నై నుంచి అమెరికాకు వలసవచ్చారు.

భారత సంతతికి చెందిన ప్రమీల జయపాల్‌(51) కూడా రికార్డు సృష్టించారు. అమెరికా ప్రతినిధుల సభ​కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికా మహిళగా ఘనత సాధించారు. వాషింగ్టన్‌ నుంచి డెమోక్రాటిక్‌ పార్టీ తరపున పోటీ 57 శాతం ఓట్లు సాధించారు. ఆమె ప్రత్యర్థికి బ్రాడీ వాకిన్షాకు 43 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

ప్రతినిధుల సభకు పోటీ చేసిన భారతీయ అమెరికన్ రాజా కృష్ణమూర్తి గెలుపు సాధించారు. ఇలినాయి నుంచి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు ఎన్నికయ్యారు. కృష్ణమూర్తికి ప్రవాస తెలుగు సంఘాలు మద్దతుగా నిలిచాయి. ప్రతినిధుల సభకు పోటీ పడిన మరో ఇండియన్‌ అమెరికన్‌ పీటర్‌ జాకబ్‌ పరాజయం పాలయ్యారు. న్యూజెర్సీ నుంచి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. రిపబ్లికన్‌ అభ్యర్థి లియోనార్డ్‌ లాన్స్‌ చేతిలో 15 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు.

మరిన్ని వార్తలు