ఇన్‌ఫ్లేషన్‌ మండుతోంటే..ఈ డ్యాన్స్‌లేంటి? కమలా హ్యారిస్‌పై మండిపాటు  | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫ్లేషన్‌ మండుతోంటే..ఈ డ్యాన్స్‌లేంటి? కమలా హ్యారిస్‌పై మండిపాటు 

Published Mon, Sep 11 2023 7:35 PM

Vice President Kamala Harris Mocked for Granny Moves at White House Party - Sakshi

Kamala Harris Dances To Hip-Hop: యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ డ్యాన్స్ చేసిన వీడియో  ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.   వైట్ హౌస్‌లో హిప్-హాప్ 50వ వార్షికోత్సవ వేడుకను వైట్ హౌస్ పార్టీ  ఇచ్చారు. దీనికి సంబంధించి హిప్-హాప్ ట్యూన్‌లకు అడుగులేశారు. దీంతో నెటిజన్లు ధ్వజమెత్తారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం షాక్‌,  విధ్వంసకర మౌయి అగ్నిప్రమాదాల అనంతర పరిణామాలు వంటి తీవ్రమైన సమస్యలతో అమెరికా అతలాకుతమవుతోంటే, ఈమె మాత్రం బాధ్యతా రాహిత్యంతో పార్టీని ఆస్వాదిస్తున్నారంటూ నెటిజన్లు  ఆమెపై మండి పడ్డారు.  మరికొంతమంది వినియోగదారులు  ఆమె డ్యాన్స్ టైమింగ్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

రాజకీయ వ్యాఖ్యాత ఆంథోనీ బ్రియాన్ లోగాన్  గ్రానీ మూవ్స్‌ అంటూ షేర్‌ చేసిన 22-సెకన్ల నిడివి గల వీడియోలో హారిస్  డ్యాన్స్‌ చేశారు. 1999లో క్యూ-టిప్ హిట్ “వివ్రాంట్ థింగ్” కి హారిస్ డ్యాన్స్ చేయడం చూడవచ్చు. హాట్ పింక్ స్లాక్స్‌,  90ల నాటి నియాన్ బ్లౌజ్‌ని ధరించి చేసిన ఆమె స్టెప్పులు విమర్శలకు తావిచ్చాయి. కోరస్‌కు మించిన సాహిత్యం ఆమెకు తెలియదంటూ  సోషల్ మీడియాలో  చాలామంది ఎగతాళి చేసారు. "ప్యూర్ క్రింగ్" అని  కొందరు "కాకిల్ షఫుల్"గా  విమర్శలు వెల్లువెత్తాయి. కాగా హారిస్ డాన్స్‌పై విమర్శలు  చెలరేగడం ఇదే మమొదటిసారి కాదు. జూన్‌లో, బ్రావో "వాచ్ వాట్ హాపెన్స్ లైవ్ విత్ ఆండీ కోహెన్"లో డ్యాన్స్‌, ఇబ్బందికరమైన నవ్వుపై నెటిజన్లు వ్యాంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే.

హారిస్ డ్యాన్స్ మూవ్‌లు ఆన్‌లైన్‌లో ఎగతాళికి గురి కావడంపై స్పందించిన కొంతమంది పబ్లిక్ ఫిగర్‌లు కూడా మనుషులే అని గుర్తుంచు కోవాలి అంటున్నారు.  సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం,వ్యక్తిగతంగా కొంత సమయాన్ని ఆస్వాదించడానికి వారూ అర్హులే అని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement