ఆస్ట్రేలియాలో నకిలీ భారతీయ వైద్యుడు

9 Mar, 2017 21:46 IST|Sakshi
ఆస్ట్రేలియాలో నకిలీ భారతీయ వైద్యుడు

మెల్‌బోర్న్‌:
వైద్యుడిగా నమ్మించి 11 ఏళ్లపాటు ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌ ఆరోగ్య విభాగంలో పనిచేసిన ఓ భారతీయ వ్యక్తిని ఆ దేశ అధికారులు తాజాగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. భారత్‌కే వచ్చి ఉండొచ్చని ఆస్ట్రేలియా అధికారులు అనుమానిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సారంగ్‌ చితాలే అనే నిజమైన భారతీయ వైద్యుడి గుర్తింపును నిందితుడు శ్యామ్‌ ఆచార్య దొంగిలించాడు. సారంగ్‌ పేరునే ఉపయోగించి భారత పాస్‌పోర్టు, నకిలీ ఎంబీబీఎస్‌ డిగ్రీ కూడా సంపాదించాడు.

2003లో నైపుణ్యం గల ఉద్యోగుల వలసల కార్యక్రమాన్ని ఆస్ట్రేలియా నిర్వహించినపుడు న్యూ సౌత్‌వేల్స్‌ ఆరోగ్య విభాగంలో ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడ్డాడు. అనంతరం ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా తీసుకున్నాడు. 2003 నుంచి 2014 వరకు 14 ఏళ్లపాటు వివిధ ఆసుపత్రుల్లో పనిచేశాడు. తర్వాత 2016లో నోవాటెక్‌ అనే ఔషధ పరిశోధన సంస్థకు ఉద్యోగం మారాడు. ఆ సంస్థ యాజమాన్యానికి శ్యామ్‌ గుర్తింపు పత్రాలపై అనుమానం రావడంతో విషయం బయటపడింది.

మరిన్ని వార్తలు