యూఎస్లో దీపక్ దేశాయికి ఆరేళ్ల జైలు శిక్ష

11 Jul, 2015 09:54 IST|Sakshi

హోస్టన్: హెల్త్ ఇన్సురెన్స్లో మోసానికి పాల్పడినందుకు యూఎస్ లోని భారతసంతతికి చెందిన డాక్టర్కు 71 నెలల జైలు శిక్ష ఖరారైంది. అంతేకాకుండా అక్రమంగా వసూలు చేసిన 2.2 మిలియన్ డాలర్లని తిరిగి కట్టాల్సిందిగా శుక్రవారం కోర్టు ఆదేశించింది.  భారత సంతతికి చెందిన దీపక్ దేశాయి(65) లాస్వెగాస్లో ఎండోస్కోపీ సెంటర్ని నడుపుతున్నాడు.

అనిస్థీషియా సేవలకోసం సీనియర్ సిటిజన్స్, పేదల దగ్గర నుంచి యూఎస్ హెల్త్ ఇన్సురెన్స్ సిస్టమ్ నిర్ధారించిన నిబంధనలకి విరుద్ధంగా వసూళ్లకి పాల్పడ్డాడు. దేశాయి తన నేరాన్ని అంగీకరించడంతో జడ్జి 71నెలల శిక్ష విధించింది. అంతేకాకుండా అక్రమ వసూళ్లకు పాల్పడిన సొమ్మును తిరిగి కట్టాల్సిందిగా దేశాయిని కోర్టు ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు