సోనో విజన్ షోరూం లో అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

సోనో విజన్ షోరూం లో అగ్నిప్రమాదం

Published Sat, Jul 11 2015 9:32 AM

సోనో విజన్ షోరూం లో అగ్నిప్రమాదం - Sakshi

నెల్లూరు: నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సోనో విజన్ ఎలక్ట్రానిక్స్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం తెల్లవారుజామున షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. షోరూంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.  సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ. 25 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement