ఆసక్తి కలిగిస్తున్న ధృవాలు

1 Oct, 2017 16:41 IST|Sakshi

జునో ఫొటోలను విశ్లేషిస్టున్న సైంటిస్టులు

గురుగ్రహానికి దగ్గరగా వెళ్లిన జునో శాటిలైట్‌

న్యూఢిల్లీ : గురుగ్రహం.. చంద్రుడు తరువాత మనిషి అత్యంత ఆసక్తి చూపుతున్న గ్రహం.. కొన్నేళ్లుగా ఈ గ్రహంపై నాసా సహా పలు అంతర్జాతీయ సైంటిస్టులు విరివిగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యలో గురు గ్రహానికి సంబంధించిన ఆనవాళ్లను కనుగునేందుకు నాసా జునోను ప్రయోగించింది. గురుగ్రహ కక్ష్యలో తిరుగుతూ.. ‌అద్భుతమై, ఆసక్తికరమైన ఫొటోలను భూమికి చేరవేసింది. దాదాపు ఏడాది కాలంగా గురుగ్రహ కక్ష్యలో తిరుగుతున్న జునో.. విప్లవాత్మక విషయాలను గుర్తించింది. ప్రధానంగా ప్రతి 53 రోజులకు ఒకసారి.. గురువు దగ్గరగా వెళుతూ.. గ్యాస్‌ స్పాట్‌లను గుర్తించింది. ఉత్తర, దక్షిణ ధృవాల చుట్టూ దగ్గరగా తిరుగుతూ.. అక్కడి వాతావరణానికి సంబంధించిన చిత్రాలను నాసాకు పంపంది. ఇప్పుడు ఈ చిత్రాలను విశ్లేషించడంపైనే నాసా సైంటిస్టులు కుస్తీలు పడుతున్నారు.

2017 సెప్టెంబర్‌ 1న జునో.. దక్షిణ ధృవానికి దగ్గరగా వెళ్లి.. అక్కడి భౌతిక, వాతావరణానికి సంబంధించిన చిత్రాలను అందించింది. వాటిని విశ్లేషిస్తే.. గ్రహంలో మొత్తం 11 రంగులు కనిపిస్తాయి. దక్షిణార్ద గోళంతో పోలిస్తే.. ఉత్తరార్ద గోళం దగ్గర వాతావరణం విభిన్నంగా ఉంటుంది. గురు గ్రహం దగ్గర రాత్రి, పగలు వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ధృవప్రాంతాలతో పోలిస్తే.. మధ్య భాగంలో వాతావరణం మరింత విభిన్నంగా ఉంటుందని సైంటిస్టులు విశ్లేషణ చేస్తున్నారు. మచ్చలు, తక్కువగా ఉంటాయి.

మరిన్ని వార్తలు