మన జీవితకాలం ఐదేళ్లు పెరిగిందంట!

19 May, 2016 22:38 IST|Sakshi
మన జీవితకాలం ఐదేళ్లు పెరిగిందంట!

జెనీవా: గత 15 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ప్రజల సగటు జీవిత కాలం ఐదేళ్లు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ప్రకటించింది. 1960 నుంచి సగటు జీవిత కాలం పెరుగుదలను పరిశీలిస్తే ఇదే అత్యధికమని తెలిపింది. 1990లో ఆఫ్రికాలో ఎయిడ్స్ వ్యాధి, తూర్పు ఐరోపాలో సోవియట్ కూటమి విడిపోవడం వంటి కారణాలరీత్యా సగటు జీవిత కాలం బాగా తగ్గిపోయింది. తాజాగా ఆఫ్రికాలో అత్యధికంగా ఇది 9.4 ఏళ్లు పెరిగి 60 సంవత్సరాలకు చేరింది.

2015లో జన్మించిన పిల్లలు సగటున 71.4 ఏళ్లు (బాలికలు 73.8 ఏళ్లు, బాలురు 69.1 ఏళ్లు) బతుకుతారని చెప్పారు. అయితే స్థానిక పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఇందులో మార్పు ఉండొచ్చన్నారు. జపాన్ మహిళలు అత్యధికంగా 86.8 ఏళ్లు జీవిస్తారని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది.

మరిన్ని వార్తలు