హమాస్‌ చెరలో తొమ్మిది నెలల చిన్నారి.. విడుదలయ్యేనా?

14 Nov, 2023 11:11 IST|Sakshi

బోసినవ్వులు ఒలకబోస్తూ, ఎర్రటి జుట్టుతో ఇట్టే ఆకట్టుకుంటున్న ఒక బాలుని ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బాలుడు తన తల్లిదండ్రులు, నాలుగేళ్ల సోదరునితో కలసి దక్షిణ ఇజ్రాయెల్‌లోని కిబ్బత్జ్‌లో ఉండేవాడు. అక్టోబర్ 7న ఈ బాలునితో పాటు అతని సోదరుడు, తల్లి షిరి, తండ్రి యార్డెన్‌లను హమాస్ కిడ్నాప్ చేసి, తమతో పాటు తీసుకెళ్లడంతో వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. 

గాజాలో హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న సుమారు 240 మంది ఇజ్రాయెల్ పౌరుల్లో 32 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వారిలో, తొమ్మిది నెలల కేఫిర్ అతిచిన్నవాడు. నెల రోజులుగా ఈ కుటుంబం ఆచూకీపై ఎలాంటి సమాచారం లేదు. ఇంతలో కేఫీర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని  ఆ బాలుని తాత ఆశాభావం వ్యక్తం చేశారు. 

బాలుని తాత 66 ఏళ్ల ఎలీ బిబాస్ తజాపిట్ ప్రెస్ సర్వీస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమారుడు, కోడలు, ఇద్దరు మనవళ్లను హమాస్ కిడ్నాప్‌ చేసినట్లు తెలిపారు. కాగా ఎలీ తన కుమారుని ఇంటికి సమీపంలోనే ఉంటున్నారు. గాజాలో వైమానిక దాడులు ప్రారంభమైనప్పుడు తన కుమారుడు సురక్షితంగా ఉన్నట్లు తనకు సందేశం పంపాడని ఎలీ తెలిపారు. ఆ తరువాత హమాస్‌ ఉగ్రవాదులు తన కొడుకు కుటుంబాన్ని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారని ఎలీ పేర్కొన్నారు. అయితే ఆ తరువాత నుంచి తన కుమారుని కుటుంబం ఎలా ఉందో తెలియడం లేదని ఎలీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: పాలస్తీనియన్లకు ఫ్రాన్స్‌ న్యాయవాది భరోసా!

 

మరిన్ని వార్తలు