'గర్ల్ఫ్రెండ్కు కారు ఇచ్చి దాడికి వచ్చాడు'

14 Mar, 2016 09:10 IST|Sakshi
'గర్ల్ఫ్రెండ్కు కారు ఇచ్చి దాడికి వచ్చాడు'

క్లెవెలాండ్: అమెరికా అధ్యక్ష రేసులో ముందువరుసలో దూసుకెళుతున్న డోనాల్డ్ ట్రంప్పై దాడికి దిగేందుకు ప్రయత్నించిన వ్యక్తి ముందుగానే ప్రణాళిక రచించుకోని వచ్చాడని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టు చేసిన తర్వాత విచారించగా తన దృష్టిలో ట్రంప్ ఓ జాతి వివక్ష పాటించే వ్యక్తి అని, అలాంటి వ్యక్తి ప్రసంగిస్తుంటే తన మైక్రోఫోన్ లాక్కునేందుకే స్టేజ్ వైపు దూసుకెళ్లాను తప్ప ఎవరికీ హానీ చేయాలన్న ఉద్దేశం తనకు లేదని చెప్పినట్లు వెల్లడించారు.

ఇటీవల ఒహాయోలోని డేటన్‌లో జరిగిన సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా థామస్ డిమస్సిమో అనే ఆందోళనకారుడు బారికేడ్లు దూకి వేదిక వద్దకు వచ్చేందుకు ప్రయత్నించాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని అడ్డుకుని ట్రంప్‌కు రక్షణ కల్పించారు. ట్రంప్ అతనిపై నోరు పారేసుకున్నారు. ఆ వ్యక్తి ఉగ్రవాది అయి ఉండొచ్చని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడి వివరాలు వెల్లడించారు. ట్రంప్ వైపు దూసుకురావడానికంటే ముందు అతడు తన కారు తాళాలు గర్ల్ ఫ్రెండ్కు ఇచ్చి ఆమెను వెళ్లిపో అని చెప్పి మరీ వచ్చాడని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు